భారతీయుల క్రికెట్ దేవుడు సచిన్ పుట్టినరోజు సందర్భంగా చాలామంది సచిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మాజీ భారత్ బౌలర్ తన ఫేవరెట్ క్రికెటర్ సచిన్ గురించి సోషల్ మీడియాలో లైవ్ లో అభిమానులతో అనేక విశేషాలు పంచుకున్నాడు. శ్రీశాంత్ చెప్పిన విశేషాలు ఏమిటి అంటే..క్రికెట్ చరిత్రలో ఈ రోజు చాలా గొప్ప రోజు. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో ఈ రోజుని క్రీడల దినోత్సవం గా చెప్పుకోవాలి...అని తెలిపాడు. అంతేకాకుండా క్రికెట్ లో అందరు ఆటగాళ్లు ఉన్నాగాని సచిన్ కంటూ ప్రత్యేకమైన శైలి ఉంది అని తెలిపాడు. ముఖ్యంగా సచిన్ ఆడిన ఒక బ్యాడ్ తన ఇంటిలో ఉందని, అది తన ఇంటి పూజామందిరంలో దాచినట్లు చెప్పుకొచ్చాడు. సచిన్ మీద అభిమానంతో ఒకసారి ఆయన గ్రౌండ్ లో ఆడుతున్న టైమ్ లో తన ప్రాక్టీస్ గ్లౌస్ తీసుకున్నట్లు ఇప్పటికి కూడా వాటిని భద్రంగా తన దగ్గర దాచి పెట్టినట్లు తెలిపారు .

 

ముఖ్యంగా టెస్టు మ్యాచుల్లో 100 వ సెంచరీ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సచిన్ సాధించిన సమయంలో అతన్ని కౌగిలించుకున్న సంఘటన తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అని శ్రీశాంత్ చెప్పారు. ఫేవరెట్ ఫుడ్ అయినా వాడాపావ్, సుశి అంటే తనకి కూడా ఇష్టమయ్యే ఫుడ్ ఫేవరెట్స్ అని తెలిపాడు. సచిన్ లాంటి గొప్ప ఆటగాడు పుట్టిన ఇలాంటి రోజుల్లో నేను కూడా భూమి మీద ఉండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు శ్రీశాంత్ సచిన్ మీద తనకున్న అభిమానాన్ని చాటాడు. సచిన్ టెండుల్కర్ ఆడే స్ట్రెయిట్ డ్రైవ్ నా ఫేవరెట్ షాట్ అని చెప్పుకొచ్చాడు. సచిన్ కుటుంబం తో కూడా తనకి మంచి సంబంధం ఉందని, సచిన్ చాలా మానవత్వం కలిగిన మనిషి అని ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయటం అతనిలో ఉన్న పెద్ద గొప్ప క్వాలిటీ అని చెప్పుకొచ్చాడు.

 

భారత క్రికెట్ జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లకు ప్రస్తుతం స్టార్ క్రికెటర్ గా వెలుగుతున్న వాళ్లకి అప్పట్లో సచినే సలహాలు ఇచ్చారని, అటువంటి సలహాలు తీసుకున్న వారిలో ఒకరు రోహిత్ శర్మ అని తెలిపాడు. మైదానంలో సచిన్ బ్యాటింగ్ ఆడుతుంటే ఒక కవి కవిత్వం మరియు కవిత్వం రాస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ నాకు కలిగేదని శ్రీశాంత్ తెలిపాడు. వయస్సు అనేది కేవలం నెంబర్ అని అది సచిన్ నిరూపించడాని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. తనకు సచిన్ ఇచ్చిన సలహాలలో ఎప్పటికీ మరిచిపోలేనిది 'నువ్వు నీ లాగా ఆడు ప్రపంచం కోసం ఆడకు' అన్న సలహా ఎప్పటికీ మర్చిపోలేని సలహా అని తెలిపాడు. తాజాగా ఈ విషయాలన్నీ తన అభిమానులకు లైవ్ లోకి వచ్చి తన ఆరాధ్య క్రికెట్ దేవుడు సచిన్ పుట్టినరోజు సందర్భంగా అనేక విషయాలు పంచుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: