COVID - 19 మ‌హ‌మ్మారి కార‌ణం చేత ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) - 13వ సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ‌టంతో క్రికెట‌ర్లు ఇండ్ల‌కే ప‌రిమితమయ్యారు. అయితే సామాజిక మాధ్య‌మాల ద్వారా వారు వారి అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. ఇదే క్ర‌మంలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స‌హ‌చ‌రుడు, ద‌క్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ AB డివిలియ‌ర్స్ ‌తో నిర్వ‌హించిన ఇన్ ‌స్టాగ్రామ్ లైవ్ ‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పాడు. 

IHG


RCB లోని త‌మ జ‌ట్టు స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చ‌హ‌ల్ చేసే టిక్‌ టాక్‌ వీడియోలు చూస్తే అత‌డు అసలు అంత‌ర్జాతీయ ఆట‌గాడిలా కనిపించాడని కోహ్లీ తెలిపాడు. అయితే..., టిక్ టాక్‌ లో చాహ‌ల్ వీడియోలు చూశావా...? నిజానికి అస‌లు చాహ‌ల్ చేసే ప‌నులు చూస్తుంటే అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ ‌లా అసలు అనిపించ‌డం లేదు. పూర్తి క‌మేడియ‌న్ ‌లా అనిపిస్తున్నాడు. 29 సంవత్సరాల వ‌య‌సులో ఆ వీడియోలు ఎలాచేస్తున్నాడో, అని డివిలియ‌ర్స్ ‌తో కోహ్లీ అన్నాడు.

IHG


ఇది ఇలా ఉండగా చాహ‌ల్, కోహ్లీ, AB డివిలియ‌ర్స్ వీరందరూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరుపున గత కొద్ది సీజన్ ల నుండి కలిసి ఆడుతున్న విషయం అందరికి తెలిసింది. నిజానికి చాహ‌ల్ తన వీడియో ల కోసం ఏకంగా ఒక వీడియో ఛానెల్ నే మొదలు పెట్టాడు. దీనిలో తన సహచర ఆటగాళ్లతో ఫన్నీగా ఇంటర్వ్యూ చేస్తూ అందాన్ని పంచుతుంటాడు. అలాగే అందరితో పాటలు పాడించడం, డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం వంటి అనేక విశేషాలు తాను ఛానెల్ ద్వారా వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఉత్సహపరుస్తుంటాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: