మాములుగా  క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎక్కువగా ఆటగాళ్లు మరల్చడానికి ఆట మీద ఉన్న దృష్టి  పోగొట్టడానికి ప్రత్యర్థి ఆటగాళ్లు ఒక్కోసారి స్లెడ్జింగ్ కి  పాల్పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా చాలా మ్యాచ్  లలోనే జరిగాయి. అయితే నిన్న భారత్ క్రికెట్ దేవుడు ప్రపంచ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 47 వ పుట్టినరోజు సందర్భంగా పాకిస్థాన్ మాజీ ఆప్ స్పిన్నర్ సక్లెయిన్  సచిన్ టెండూల్కర్కు సారీ చెప్పిన సంఘటనను  గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా 1990లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ చేసిన అద్భుత పోరాటం గురించి గుర్తు చేసుకున్నాడు పాకిస్తాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సక్లెయిన్  ముస్తాక్. అయితే ఈ మ్యాచ్లో సక్లెయిన్ కి సచిన్ కి మధ్య మాటల యుద్ధం నడిచిన  విషయం తెలిసిందే. 

 

 ముఖ్యంగా సక్లెయిన్  సచిన్ దృష్టి మరల్చడానికి స్లెడ్జింగ్  పాల్పడటం  పెద్ద దుమారమే రేపింది. వీరోచితంగా పోరాడుతున్న  సచిన్ ను  అవుట్ చేయడానికి స్లెడ్జింగ్ పాల్పడుతు మాటలతో సచిన్ ని  రెచ్చగొట్టడం మంచి ఆలోచన అని భావించి... సచిన్ సృష్టి మరల్చడానికి స్లడ్జింగ్ కి  పాల్పడ్డాడు. ఆ సమయంలో సచిన్ ప్రవర్తించిన తీరుతో నాకు ఎంతో ఇబ్బందిగా అనిపించింది  అంటూ సచిన్ పుట్టినరోజు సందర్భంగా సక్లెయిన్  గుర్తు చేసుకున్నారు. అయితే తాను మొదటిసారి సచిన్ టెండూల్కర్ ను స్లైడ్జ్  చేసినప్పుడు నేను జట్టులో కొత్త వాన్ని  అని పాకిస్థాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సక్లెయిన్  చెప్పారు. 

 

 అయితే నేను సరిగ్గా గుర్తు చేసుకుంటే... అది 1997 ఎడిషన్.. సచిన్ నిశ్శబ్దంగా నా దగ్గరకు వచ్చి నేను మీతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు..మరి  మీరు నాతో ఎందుకు తప్పుగా ప్రవర్తిస్తున్నారు అని నేరుగా ప్రశ్నించడంతో.... తన నోట మాట రాలేదు అని చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సక్లెయిన్ . సచిన్ అలా ప్రశ్నించగానే  ఏం చెప్పాలో తెలియక నేను చాలా ఇబ్బంది పడ్డాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు స్లెడ్జింగ్  చేసిన సమయంలో సచిన్ కి సారీ చెప్పినట్లు సక్లెయిన్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: