కపిల్ దేవ్... ఈ పేరు గురించి భారతదేశంలో తెలియని వారు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. దీనికి కారణం భారత దేశానికి మొట్టమొదటి సారిగా ప్రపంచ కప్ ను అందించిన టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్ తన పేరును సువర్ణ అక్షరాలతో క్రికెట్ చరిత్రలో రాసుకున్నాడు.

 

IHG's Greatest All-Rounder – Almanack Tribute | Wisden

 

1983 సంవత్సరం వెస్టిండీస్ తో లండన్లోని లార్డ్స్ మైదానంలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 183 పరుగులకే ఆలౌట్ అవ్వగా ఆ తరువాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ కేవలం 140 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత జట్టు 43 పరుగులతో మొదటి వరల్డ్ కప్ అందించడంలో కపిల్ కీలక పాత్రను పోషించారు.

IHG


అయితే కపిల్ దేవ్ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మనం క్రికెట్ గురించి కాకుండా చదువు గురించి మాట్లాడాలని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తెలిపాడు. నిజానికి క్రికెట్ పున ప్రారంభం కంటే ముందుగా విద్యాసంస్థలు తెచ్చుకోవాలని ఆయన తన అభిప్రాయాన్ని మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు.


దీనికి కారణం నేటి విద్యార్థులే మన భవిష్యత్తు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి విపత్తుల పరిస్థితి సమయంలో విద్యార్థులు స్కూలు, కాలేజీలకు వెళ్ళలేకపోతున్నారని ఈ పరిస్థితుల్లో తాను ముందుగా విద్యాసంస్థలు తెరుచుకోవాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కపిల్ ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిపాడు. ఏది ఏమైనా ఇలా సీనియర్ క్రికెటర్ ఇలా మంచి ఆలోచన చేయడం నిజంగా అభినందించాల్సిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: