ప్రముఖ పాకిస్తాన్ మహిళ మాజీ కెప్టెన్ సనా మీర్ తన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించడం జరిగింది. సనా మీరా తన 15 సంవత్సరాల క్రికెట్ చరిత్రలో ఆమె మొత్తం 226 మ్యాచులు అడగ.. ఇక 2009 -2017 సంవత్సరం మధ్య కాలంలో మొత్తం 137 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించడం జరిగింది. గత సంవత్సరం నవంబర్ లో క్రికెట్ నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్లు తెలియజేయడం జరిగింది.

IHG


ఇది ఇలా ఉండగా కొన్ని నెలలుగా నేను దీనిపై ఆలోచిస్తున్నాను ఇదే సరైన టైం అని నేను భావిస్తున్నాను. మహిళా క్రికెట్ లో ఎంతో మంది చాలా గొప్ప క్రికెటర్లతో నేను పరిచయాలు పెంచుకున్నాను. ఏది ఏమైనా ఆటను ప్రేమించాలి అది గెలుపైనా సరే ఓటమినైనా సరే అంటూ సనా మీర్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఇక కరాచీ వేదికగా 2005 లో పాకిస్తాన్ లో  నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ లో సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆహ్వానించడం జరిగింది. సనా తన క్రికెట్ కెరీర్లో మొత్తం 120 వన్డేలు అడగా 1630 పరుగులు తీసింది. ఇక టి -20 మ్యాచులలో 106 మ్యాచ్లు ఆడగా 802 పరుగులు చేయడంతో పాటు ఎనభై తొమ్మిది వికెట్లు తీయడం జరిగింది. 


అంతేకాకుండా 2013, 2017 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో .... 2010, 2012, 2014, 2016 టీ - 20 ప్రపంచకప్ ఫైనల్లో సనా మీర్ పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించడం జరిగింది. ఇంత సుదీర్ఘ కాలంలో నాకు అండగా నిలిచిన వారికి అందరికీ ధన్యవాదాలు అంటూ తెలియజేయడం జరిగింది. అలాగే ఐసీసీ మహిళా క్రికెట్ పై చూపుతున్న శ్రద్దకు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: