ప్రస్తుతం ప్రపంచంలో కరోనా ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ప్రస్తుతం 28 లక్షలకు పైగా కరుణ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏకంగా 2 లక్షల మంది మృత్యువాత పడ్డారు. దీనితో చాలా రంగాలపై దీని ప్రభావం పడింది. ఈ వైరస్ కారణంగా కొన్ని రంగాలపై దీని ప్రభావం చాలా ఎక్కువగా పడింది. అయితే ఈ వైరస్ ప్రభావం క్రీడా రంగం పై ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే....


నిరాదరణకు గురైన పిల్లల సంక్షేమం కొరకు గత సంవత్సరం వరల్డ్ కప్ లో వినియోగించిన కొంత క్రికెట్ సామాగ్రిని ప్రస్తుత భారత క్రికెట్ ప్లేయర్ భారత్ ఆర్మీ సంస్థకు ఇవ్వడం జరిగింది. అయితే వీటిని వేలంలో పెట్టగా 2019 సంవత్సరంలో జరిగిన వన్డే ప్రపంచకప్ లో తాను వినియోగించిన బ్యాట్ వేలంలో ఏకంగా 2 లక్షల అరవై నాలుగు వేల రూపాయలు పలికింది. అలాగే వేలంలో రాహుల్ వాడిన హెల్మెట్ రూ. 122677, ప్యాడ్లు 33,028, వన్డే జెర్సీ రూ. 1,13,240, టీ20 జెర్సీ రూ.1,04,824, టెస్టు జెర్సీ రూ.1,32,774, గ్లవ్స్‌ రూ.28,728 ధర వేలంలో పలికాయి. 


అయితే వీటితో వచ్చిన మొత్తాన్ని వారి ఫౌండేషన్ ద్వారా నిరాదరణకు గురైన పిల్లల కోసం వీటిని ఉపయోగించబోతున్నారు. అయితే ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ పోయిన సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ ఎదురైన ఓటమిని భారత క్రికెటర్లు ఇంకా మరిచిపోలేదని వారికి ఇంకా ఆ ఓటమి వెంటాడుతూనే ఉంది అని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. నిజానికి ఆ మ్యాచ్ కలలోకి వచ్చి కూడా హఠాత్తుగా నిద్రలేచిన రోజులు కూడా ఉన్నాయని రాహుల్ తన రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. కాల్ రాహుల్ గత కొన్ని సిరీస్ ల నుండి కూడా టీమిండియా విజయాలలో ప్రముఖ పాత్ర పోషించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: