ప్రపంచంలో కరోనా వైరస్ ఏ రేంజ్ లో ఇబ్బందులు పడేస్తుందో అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని దెబ్బకి ప్రపంచంలో ప్రస్తుతం రెండు లక్షల మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు లాక్ డౌన్ ఈ విధానాన్ని పాటించి ప్రజల్ని ఇంటికే పరిమితం చేశాయి. దీంతో ప్రపంచంలో జరగాల్సిన పెద్ద పెద్ద కార్యక్రమాలు క్రీడలు ఇలా అన్ని రంగాల్లో పై దీని ప్రభావం పడింది. ఇక దీని ప్రభావం క్రీడారంగం పై పూర్తిగా పడింది దీనికి కారణం, ఏదైనా క్రీడా సంబరం జరుగుతాయి అనేకమంది క్రీడాభిమానులు చూడడానికి రావడం జరుగుతుంది దీనితో క్రీడా రంగాన్ని పూర్తిగా నిలిపివేశారు. 

 

 

ఇక అసలు విషయానికి వస్తే... కరోనా ప్రభావం పూర్తిగా అంతమయ్యాకే క్రికెట్ పోటీలను మళ్లీ ప్రారంభించాలని భారత మాజీ క్రికెట్ స్టార్ ఆల్ రౌండ్ యువరాజ్ సింగ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. దీనికి కారణం ఆటగాళ్లు ఆరోగ్యానికి భద్రతకు పెద్దపీట వేయడం అని ఆయన తెలిపారు. శనివారం నాడు ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఆన్లైన్ కార్యక్రమంలో యువరాజ్ సింగ్ పలు అంశాలపై మాట్లాడడం జరిగింది. కరోనా వైరస్ నుంచి తొలత ఎవరి దేశాన్ని వారు కాపాడుకోవాలి అన్నది తన అభిప్రాయమని చెప్పుకొచ్చాడు.

 

 

కరోనా వైరస్ పూర్తిగా అంతమయ్యేవరకు వేచిచూడాలని లేకపోతే 90 నుంచి 95 శాతం వరకు తగ్గినప్పుడు మాత్రమే సీరిస్ జరిగే ఆస్కారం ఉందో లేదో ఒకసారి సమీక్షించుకోవాలని బోర్డులకు తెలియజేశాడు. ఎందుకంటే ప్రస్తుతం ఆటగాళ్ళు మైదానంలోకి అడుగు పెట్టాలన్నా, వారి సహచరులతో డ్రెస్సింగ్ రూమ్ ని షేర్ చేసుకోవాలి అన్న నిజానికి భయపడే పరిస్థితి ఉందని చెప్పుకొచ్చాడు. ఏదైనా ఆటగాడు దేశం తరపున బరిలోకి దిగేటప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని యువరాజ్ సింగ్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: