పివి సింధు... పూర్తిపేరు పూసర్ల వెంకట సింధు... ఈ పేరు గురించి భారత్ లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. దీనికి కారణం ఆమె బ్యాడ్మింటన్లో సాధించిన విజయాలని చెప్పవచ్చు. క్రితం సారి జరిగిన ఒలంపిక్స్ క్రీడలలో బ్యాడ్మింటన్లో వెండి పతకాన్ని సాధించి అందరి నోటితో ఔరా ... అనిపించుకున్న భారత మహిళ పీవీ సింధు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అన్ని రంగాల క్రీడాకారులు ఇంట్లోనే సమయాన్ని గడుపుతారు. ప్రస్తుతం పీవీ సింధు పరిస్థితి కూడా అంతే అని చెప్పవచ్చు.

 

ఇక అసలు విషయానికి వస్తే... కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తన అక్క కొడుకు ఆర్యన్ తో కలిసి పూర్తిగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. లాక్ డౌన్ కారణంతో అవుట్ కోర్ట్ ప్రాక్టీస్ కు పూర్తిగా దూరమైన సింధు ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేస్తూ చిన్నచిన్న వర్కౌట్ లతో షాడో ప్రాక్టీస్ లో పాల్గొంటోంది. చిన్నప్పటినుంచి బ్యాడ్మింటన్ పరంగా బిజీగా ఉండటంతో పట్టుమని పది రోజులు కూడా ఇంట్లో ఉండని సింధు ఇప్పుడు పూర్తిగా విరామం తీసుకుంటూ సమయాన్ని ఫ్యామిలీతో గడిపేస్తోంది. అయితే ఈ సమయం ఆమెకి కొత్తగా అనిపిస్తుందట. ఉదయం కాస్త గడిచిపోయినా, సాయంత్రం అయ్యే సరికి పూర్తిగా బోర్ కొడుతుంది అంట. దీనితో ఏడాది వయసున్న తన అక్క కొడుకు తో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నానని చెబుతోంది.

 


తాను సాయంత్రం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆర్యాన్ కూడా ఉంటాడని అతడితో పాటు కలిసి ఆడుకుంటే సమయమే తెలియదని పీవీ సింధు చెప్పుకొచ్చింది. ఈ అంశంపై పి.వి.సింధు తండ్రి మాట్లాడుతూ... పెద్దమ్మాయి ఇక్కడే పక్కనే ఉంటుంది కాబట్టి వారు ప్రతిరోజు సాయంత్రం పూట మా ఇంటికి ఆర్యాన్ వస్తాడని వాడు వస్తే ఇల్లంతా సందడిగా మారిపోతుందని చెప్పుకొచ్చాడు. అప్పటివరకు ఏదో బోరింగ్ గా ఉన్న సింధు ఆర్యన్ రాకతో పూర్తి యాక్టివ్ అవుతుందని తన అల్లరితో పూర్తిగా ఎంజాయ్ చేస్తుందని చెబుతున్నాడు. చిన్న పిల్లల అల్లరి ఎవరికి ఇష్టం ఉండదు అని అంటున్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: