ప్రస్తుతం ప్రపంచంలో కరోనా ఎలాంటి విలయతాండవం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో ఈ వైరస్ మొదలు అవ్వగా అతి కొద్ది కాలంలోనే ప్రపంచంలో ప్రతి దేశానికి ఇది చేరింది. అయితే ఇది ఇలా ఉండగా కరోనా వైరస్ దెబ్బకి అన్ని రంగాలు కుదేలు అయ్యాయని చెప్పవచ్చు. అనేక దేశాలలో లాక్ డౌన్ దృష్ట్యా కొన్ని మినహా అన్ని రకాల కంపెనీలను పూర్తిగా మూయడం జరిగింది. దీనితో చాలా మంది ఇబ్బంది పడవలిసి వస్తుంది. కొన్ని దేశాలలో ఈ వైరస్ దెబ్బకు చివరకు అన్నం కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.

 


ఇక అసలు విషయానికి వస్తే... కరోనా దెబ్బకి ప్రపంచంలో ప్రతిచోటా క్రీడా రంగం పూర్తిగా ఆగిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇది ఇలా ఉండగా సెంట్రల్ అమెరికాలో ఒక బాక్సింగ్ టోర్నీ ప్రారంభమైంది. దాని పూర్తి వివరాల్లోకి వస్తే... సెంట్రల్ అమెరికాలోని నిక‌రాగ్వ‌లో భాగాల్లో మాత్రం బాక్సింగ్ టోర్నీ మొదలవడం జరిగింది. అక్కడి రాజధాని మ‌నాగ్వాలో జరిగిన పోటీలను ప్రత్యక్షంగా, అలాగే టీవీల ద్వారా అనేకమంది అభిమానులు చూశారు.అయితే బౌట్ వేదికైన అలెక్సిస్ అర్గొయె జిమ్‌ లో మొత్తం ఎనిమిది వేల మంది ప్రేక్షకులు కూర్చునే అవకాశం ఉండగా కేవలం 800 మంది మాత్రమే హాజరయ్యారు.

 


అయితే వారు కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆ మ్యాచ్ లను చూసి ఆనందించారు.నిజానికి బాక్స‌ర్ల కడుపు నిండాలంటే బౌట్ లో పాల్గొనడం తప్ప మరి ఇంకో మార్గం లేదని తమది నిరుపేద దేశం అని నిర్వాహకులు తెలియజేశారు. కరుణ వైరస్ కి తాము ఎటువంటి భయపడడం లేదని వారు పేర్కొనడం నిజంగా గమనార్హం. ఏది ఏమైనా కరోనా ఉన్న సమయంలో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్టో ఆ దేశ వాసులకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: