టీమిండియా జట్టుకి ఇప్పటి వరకు అనేక మంది కెప్టెన్లు మారుతూ వచ్చారు.నిజానికి అందులో సక్సెస్ అయిన కెప్టెన్లు చాలా కొద్దిగానే అని చెప్పవచ్చు. కొందరు కెప్టెన్సీని పొందిన తర్వాత టీంని సరిగా నడపలేక వారికి కెప్టెన్సీని వదులుకోవడంలోనూ అడుగు వేయడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే... మన భారత దేశపు జట్టుకు కెప్టెన్ బాధ్యతలు వహించిన సౌర‌వ్ గంగూలీ, రాహుల్ ద్ర‌విడ్‌, అనిల్ కుంబ్లే, మ‌హేంద్ర‌సింగ్ ధోనీ వీరు నలుగురూ గొప్ప నాయకులు అంటూ  భారత మాజీ బౌలర్ ఆర్పీ సింగ్ తెలియజేయడం జరిగింది. 


ఇక ఈ నలుగురి కెప్టెన్సీలో మ్యాచ్ లు ఆడిన రుద్ర ప్రతాప్ సింగ్.. అందరికంటే కుంబ్లే బెస్ట్ అని తెలియజేశాడు. ఇక దాదా విషయానికి వస్తే.. జుట్టులో ఉండే సభ్యులందరికీ మనోధైర్యం ఎలా పెంచాలో బెంగాల్ టైగర్ కంటే ఎవరికీ తెలియకపోవచ్చు అంటూ కొనియాడాడు. తాను మొదటగా సౌరవ్ గంగూలి కెప్టెన్ గా ఉన్నపుడు జాతీయ జట్టులోకి రావడం జరిగింది అని తెలుపుతూ, మొదటగా మైదానంలో బంతి నా వైపు విసిరిన దాదా వెళ్లి బౌలింగ్ చెయ్యి అంటూ నన్ను పంపాడు. ఇక తొలి బంతి వైడ్ తర్వాతి బంతికి కూడా వైడ్ అయినా సరే నన్ను ఏమీ అనలేదు. 


అంతే కాకుండా మొదట్లో ఎవరికైనా ఇలానే జరుగుతుంది... ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను అంటూ ఆర్పీ సింగ్ తెలిపాడు. ఇక బౌలర్ గా కుంబ్లే కెప్టెన్సీ అత్యుత్త‌మ‌మ‌ని, కుంబ్లే సుదీర్ఘ కెరీర్లో చాలా మ్యాచులు ఆడిన అనుభవం ఉండడంతో, బౌలింగ్ విషయంలో  కుంబ్లే కు పూర్తి అవ‌గాహ‌న సొంతమంటూ తెలియజేశాడు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. రాహుల్ ద్రావిడ్ ను మించిన సారధి మరొకరు లేరు అంటూ తెలిపాడు. ఇక మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని విషయానికి వస్తే మ్యాచులు చదవడంలో మాస్టర్ అంటూ ఆర్పీ సింగ్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: