ప్రస్తుతం కరోనా వైరస్ పుణ్యమా అని ఆటగాళ్లందరూ ఎవరింటికి వారే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు వారందరూ తీరిక సమయం దొరకడంతో వారి వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తున్నారు. అయితే అభిమానుల్ని పలకరించడం కోసం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనబడుతూ ఆనందాన్ని పంచుతున్నారు. అలాగే కొన్ని వారి పర్సనల్ విషయాల గురించి తెలుపుతూ అభిమానులను ఆనంద పరుస్తున్నారు...


ఇక అసలు విషయానికి వస్తే.. తాను ప్రతి నిమిషం నా ఆటను మెరుగుపర్చేందుకు కష్టపడుతూ ఉంటానని టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. క్రితం ప్రదర్శన కంటే మెరుగైన ఆటతీరును ఆడటానికి నిత్యం శ్రమిస్తూ ఉంటానని తాను తెలిపాడు. అయితే క్రితం సంవత్సరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత పరిమిత ఓవర్ల క్రికెట్ కు రవిచంద్రన్ అశ్విన్ దూరమయ్యాడు. దీనితో కేవలం టెస్టుల్లో మాత్రమే అశ్విన్ కనిపిస్తున్నాడు. అయితే ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు సక్లైన్ ముస్తాక్ మాట్లాడుతూ భారత్ లో అశ్విన్ అత్యుత్తమ స్పిన్నర్ అని తెలిపాడు. అలాంటి అశ్విన్ ఇప్పుడు జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు అన్న విషయాన్ని తెలియజేస్తూ మాట్లాడు.


అయితే తాజాగా రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ... నేను గతంలో కనపరిచిన ప్రదర్శన కంటే మరి కాస్త మెరుగైన ప్రదర్శన చేయడం నా లక్ష్యం అంటూ దానికి నేను ఎంతో శ్రమిస్తున్నా అని చెప్పుకొచ్చాడు. అయితే స్వదేశంతో పోల్చుకుంటే విదేశాల్లో అంతగా వికెట్లు తీయడం పై నేను దృష్టి సాధించాలని ముఖ్యంగా ఇంగ్లాండ్ వంటి దేశాలలో వారి పిల్లలపై ప్రభావం చూపాలని భావిస్తున్నానని అతడు తెలిపాడు. అంతేకాకుండా తాను ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను పెట్టుకుంటూ ముందుకు సాగుతాను అని తెలియజేశాడు. ఆట కేవలం నా వరకే కాకుండా గత ప్రదర్శన అధిగమించడమే లక్ష్యంగా పెట్టుకుంటు ముందుకు సాగుతున్న అని తెలిపాడు. అయితే ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2020 లో ఆడాలి అనుకున్నాడు. కానీ ఐపీఎల్ వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: