ఆస్ట్రేలియా ఓపెనర్, సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈయన గ్రౌండ్ లో ఎంత యాక్టివ్ గా ఉంటాడో బయట కూడా అంత యాక్టివ్ గా ఉంటాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయనతో కలిసి పని చేసేటప్పుడు చాలామంది క్రికెటర్లు చెప్పినది ఏమిటంటే ఆయనతో పనిచేయడం చాలా సరదాగా ఉండడంతో పాటు ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు అని తెలిపారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

ISO Monday’s #flicktheswitch @candywarner1

A post shared by David Warner (@davidwarner31) on


ఇక ఈ మధ్య కరోనా వైరస్ నేపథ్యంలో అందరి క్రికెటర్లు ఇంటికే పరిమితమైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్ వారి కుటుంబంతో హాయిగా కాలక్షేపం చేస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. మామూలుగా మైదానంలో బౌండరీలతో హోరెత్తించే డేవిడ్ వార్నర్ ప్రస్తుతం టిక్ టాక్ వీడియోలతో మంచి వినోదాన్ని ఇస్తున్నాడు అభిమానులకు.

 

అసలు విషయానికి వస్తే... కొన్ని రోజుల క్రితం తన కూతురుతో కలిసి డాన్స్ చేస్తూ కొన్ని వీడియోలు అప్లోడ్ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఇప్పుడు తన భార్య క్యాండీస్ తో కలిసి ఓ వీడియోని అప్లోడ్ చేశాడు. అయితే తన భార్య కూడా ఒక స్పోర్ట్స్ ఉమెన్. తన భార్యతో కలిసి పోస్ట్ చేసిన వీడియో తెగ నవ్వులు పూయిస్తుంది అని చెప్పవచ్చు. వార్నర్ భార్య సర్ఫింగ్ లో మేటి. ఫుల్ ఫిట్నెస్  తో ఉండే ఆవిడ బోటు సర్ఫింగ్ లో ఎక్స్‌ప‌ర్ట్‌.


అయితే డేవిడ్ వార్నర్ చేసిన వీడియోలో ఒక చిన్న గమ్మత్తు జరిగింది. వార్నర్ తన కాస్ట్యూమ్స్ లో ముందుగా ఆసీస్ జట్టు జెర్సీ వేసుకొని కనిపించాడు. ఆ తరువాత ఓనర్ వెనకాల క్యాండీస్  సర్ఫింగ్ కాస్ట్యూమ్ లో బోటు నడుపుతున్నట్లు కనిపించింది. ఒక ఆ వీడియోలో మ్యూజిక్ తో కొనసాగిస్తూ అకస్మాత్తుగా ఆ వీడియోలో ఇద్దరి ప్లేస్ మారిపోతుంది. అయితే అప్పుడు క్యాండీస్ వార్నర్ డ్రెస్ లో, వార్నర్ తన భార్య డ్రెస్ లో కనిపిస్తారు. ఇక అంతే ఆ వీడియో చూసిన ప్రతి వారు నవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో వారి ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: