ప్రపంచ క్రికెట్లో ఫిక్సింగ్ అనేది చాలా పెద్ద సంగతి. దీనితో అనేక దేశ క్రికెటర్లు వాళ్ల బంగారు భవిష్యత్ ను నేలపాలు చేసుకున్నారు. ఒక్కో దేశంలో అంత మంది క్రికెటర్లు డబ్బు సంపాదించడానికి అక్రమ మార్గాలు ఎంచుకొని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిజానికి ఎంతో మంది క్రికెటర్లు వారి జీవితాలను క్రికెట్ నుంచి దూరం చేసుకున్నారు.


ఇక అసలు విషయానికి వస్తే.. మొన్న జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ ( PSL ) ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందే క్వెటా గ్లాడియేటర్స్ జట్టు తరఫున ఆటగాడైనా ఉమర్ అక్మల్ ని బుక్కీలు సంప్రదించడంతో అతను సంప్రదింపులు జరిపాడని రుజువు కావడంతో అతనికి ఏకంగా మూడు సంవత్సరాలు నిషేధం విధించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. అయితే ఈ విషయం పై వివాదాస్పద పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్ ని అన్ని ఫార్మాట్ల నుంచి మూడేళ్ల పాటు తనని నిషేధానికి గురి చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 వ తారీకు జరిగిన మ్యాచ్ కు ముందు ఈ సంఘటన జరిగింది. అయితే ఈ విషయంపై పూర్తి విచారణ మార్చి 17వ తారీఖున PCB అవినీతి నిరోధక విభాగం అతని పై అభియోగాలు నమోదు చేసింది. అయితే వీటిపై ఉమర్ అక్మల్ అప్పీలు చేయగా అతని వాదనలు విన్న పీసీబీ డిసిప్లెనరీ ప్యానెల్​ సోమవారం నాడు ఏకంగా మూడు సంవత్సరాల నిషేధాన్ని విధిస్తూ తుది నిర్ణయం తీసుకుంది.


అయితే ఇప్పటి వరకు ఉమర్ అక్మల్ 16 టెస్టులు ఆడి 1003 పరుగులు చేశాడు. అలాగే ఉమర్ అక్మల్ 84 టీ20ల్లో 1690 పరుగులు చేశాడు. అయితే ఈయనకు తన క్రికెట్ కెరియర్ కంటే వివాదాల కారణంగా ఎక్కువగా వార్తల్లో ఎప్పుడు నిలిచేవాడు.ఈ మధ్య కాలంలో లాహోర్ లోని జాతీయ క్రికెట్ అకాడమీలో కూడా ఫిట్నెస్ ట్రైనర్ తోనూ అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిసిన సంగతే.

మరింత సమాచారం తెలుసుకోండి: