అసలు ఈ సంవత్సరం జరగబోయే టి20 వరల్డ్ కప్ జరుగుతుందో లేదో కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. అయితే అప్పుడే ఈ సిరీస్ పై ఘాటు మాటలు మొదలయ్యాయి. ఇక అసలు విషయానికి వస్తే.... ఆస్ట్రేలియా గడ్డపై అక్టోబర్ నెలలో టీ - 20 వరల్డ్ కప్ జరగనుండగా. అయితే ఆ టోర్నీ ఫస్ట్ ఓవర్లోనే డేవిడ్ వార్నర్ తను అవుట్ చేస్తానని భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన ధీమా వ్యక్తం చేశాడు. ఇక లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం క్రికెటర్లు అందరూ ఎవరి ఇంట్లో వారు ఉంటున్నారు. అయితే అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా అభిమానుల్ని అలరించడానికి ఆన్లైన్లోకి వస్తున్నారు.


అయితే ఇదే క్రమంలో డేవిడ్ వార్నర్ తాజాగా ఒక లైవ్ నిర్వహించగా అందులో భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గెస్ట్ గా వచ్చాడు. ఇందులో డేవిడ్ వార్నర్ అభిమానుల నుంచి ప్రశ్నల్ని ఆహ్వానించడం జరిగింది. అయితే ఒక అభిమాని అక్టోబర్ లో జరగబోయే టీ - 20 వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకొని భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంటే అభిమాని ఒక ఆసక్తికరమైన ప్రశ్నని భువనేశ్వర్ కుమార్, వార్నర్ కి ఇచ్చాడు. అయితే ఆ ప్రశ్నకి భువనేశ్వర్ కుమార్ చాలా ఫన్నీగా సమాధానం ఇచ్చి అందరికీ నవ్వు తెప్పించాడు. 

 

అదేమిటంటే టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా విజయానికి చివరి బాల్ కి నాలుగు పరుగులు అవసరం ఉంటే నువ్వు ఎటువంటి బాల్ వేస్తావని డేవిడ్ వార్నర్ ప్రశ్నించాడు. అయితే వారు అడిగిన ప్రశ్నకి భువనేశ్వర్ కుమార్ సమాధానం ఇస్తూ డేవిడ్ వార్నర్ చివర్లో నేను నీకు బౌలింగ్ చేయను ఎందుకంటే ఆ మ్యాచ్ ఫస్ట్ ఓవర్ లో నిన్ను అవుట్ చేస్తాను కాబట్టి అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. అయితే ఈ దెబ్బకి డే డేవిడ్ వార్నర్ కి ఏమి సమాధానం ఇయ్యాలో కొన్ని క్షణాలు ఏమీ అర్థం కాలేదు.


అయితే నిజానికి ఆ ప్రశ్న అడిగిన తర్వాత వారు ఒక హింట్ కూడా ఇచ్చాడు. నా అంచనా ప్రకారం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో బౌండరీ లైన్స్ అన్ని దూరంగా ఉంటాయి కాబట్టి నకల్ బాల్ అనుకుంటున్నాను అని తెలిపాడు. కాకపోతే చివరగా భువీ కెప్టెన్, సహచర ప్లేయర్ల అభిప్రాయాలు తీసుకుని ఆ తర్వాత ఫైనల్ బాల్ పై తుది నిర్ణయం తీసుకుంటానని చివరిగా భువనేశ్వర్ కుమార్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: