ప్రస్తుతం కరోనా వైరస్ బారినపడి ప్రపంచం అతలాకుతలం అవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీంతో అనేక రంగాలు చతికిల పడ్డాయి అని చెప్పవచ్చు. ఇందులో క్రీడా రంగం పూర్తిగా మూత పడింది అని చెప్పుకోవచ్చు. దీంతో ప్రపంచంలో నలుమూలల ఇలాంటి క్రీడ సంబరం ప్రస్తుతం జరగడం లేదు. దీని కారణంగా ఏకంగా ఒలంపిక్స్ ను వచ్చే సంవత్సరానికి వాయిదా వేయడం మన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఒక్క ఒలంపిక్స్ క్రియేట్ మాత్రమే కాకుండా అన్ని క్రీడలకు సంబంధించి పెద్ద పెద్ద ఈవెంట్లు అన్ని రద్దు జరగడం అయ్యింది.

 

అయితే ఇక అసలు విషయానికి వస్తే... ఈ వైరస్ దెబ్బకి భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ క్రికెట్ కౌంటీ కాంట్రాక్ట్ రద్దయింది. అయితే ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్లో ఈ ఏడాది యార్క్ షేర్ క్లబ్ తో రవిచంద్రన్ అశ్విన్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే గతంలో అతడు వొర్సెస్ట‌ర్ షైర్‌, నాటింగ్‌హ‌మ్ షైర్ జట్లకు రవిచంద్రన్ అశ్విన్ వహించాడు.

 


అయితే ప్రస్తుతం కరుణ మహమ్మారి కారణంగా జూలై వరకు ఎటువంటి క్రికెట్ టోర్నమెంట్ మా దేశంలో నిర్వహించకూడదని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ నిర్ణయించడంతో కౌంటీ సీజన్ ను  వాయిదా వేసినట్లు తెలిపారు. దీనితో ఆటగాళ్ల కాంట్రాక్టులో పూర్తిగా రద్దు అని చెప్పవచ్చు. పరిస్థితిని అర్థం చేసుకొని సహకరిస్తున్న ప్లేయర్లకి కృతజ్ఞతలు, ఇలాంటి విపత్కర సమయంలో ఆటకం నా ప్రాణాలు ముఖ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని షేర్ క్రికెట్ డైరెక్టర్ విషయాన్ని తెలిపారు. అయితే ఈ సందర్భంగా కేవలం అశ్విన్ మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ కేశవ మహారాజ్, వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ నికోలస్ పూరన్ వారి యొక్క ఒప్పందాలు కూడా రద్దు అయినట్లు వారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: