కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచం నలుమూలల క్రీడా రంగం పూర్తిగా స్తంభించింది అని చెప్పవచ్చు. అయితే క్రీడాకారుల్లో వారి అభిమానులను ఉత్సాహపరిచే ఎందుకు అనేక మార్లు ఆన్లైన్ లోకి వచ్చి అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఇక ఈ కోవలో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా ఒకడు అని చెప్పవచ్చు. నిజానికి వార్నర్ కు కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం తన ఆటకు అభిమానులను సంపాదించుకున్నాడు.


తాను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లోకి వస్తూ క్రికెటర్లతో మాటామంతి మాట్లాడుతూ... వీలు దొరికినప్పుడల్లా టిక్ టాక్ వీడియోలతో నవ్వు తెప్పించే విధంగా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఆయన తన కూతుర్లతో బాలీవుడ్ కు సంబంధించిన పాటలతో స్టెప్పులు వేస్తూ మాకు ఎవరైనా హెల్ప్ చేయండి ఈ విషయంలో అంటూ కొన్ని రోజుల క్రితం కొన్ని పోస్టులను అప్లోడ్ చేశాడు. అయితే ఆ తర్వాత మళ్లీ తన భార్యతో ఒక వీడియోను తీసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇలా ఎప్పుడూ కాస్త ఫన్ ను జోడించి వీడియో లను వార్నర్ అప్లోడ్ చేస్తున్నాడు.


అయితే ఇక తాజాగా మరో వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఇందులో మరోసారి తన కూతురుతో కలిసి టీమిండియా ఆటగాళ్లు గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఓ చాట్ షోలో భాగంగా వార్నర్ మాట్లాడుతున్న సమయంలో అతని వద్దకు వచ్చిన కూతుర్లను మీ అభిమాన క్రికెటర్ ఎవరూ అని అడిగితే కోహ్లీ తమ ఫేవరేట్ అని, ఓవరాల్ గా డేవి (డేవిడ్ వార్నర్) ఇష్టమని తన ఇద్దరు కూతుర్లు చెప్పుకొచ్చారు. అయితే మరి కోహ్లీతో ఫోటో దిగడం మీకు ఇష్టమైన అన్న ప్రశ్నకు తన ఇద్దరు కూతుర్లు భారత్ కెప్టెన్ తో సెల్ఫీ దిగారు అనుకుంటున్నట్లు వారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: