షోయబ్ అక్తర్.. ఈ పాకిస్తానీ మాజీ ఫాస్ట్ బౌలర్ ఈ మధ్య వరుస వీడియోలు పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్ గా మారడం జరిగింది. అయితే షోయబ్ అక్తర్ పై పిసిబి అడ్వైజర్ తఫాజ్జుల్‌ రిజ్వి పరువు నష్టం కేసు నమోదు చేశారు. అంతేకాకుండా షోయబ్ అక్తర్ పై క్రిమినల్ కేసును కూడా ఫైల్ చేశారు. ఇక అవినీతి ఆరోపణ లలో భాగంగా పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ పై మూడు సంవత్సరాల నిషేధం విధించిన సమయంలో పిసిబి లీగల్ డిపార్ట్మెంట్ పై షోయబ్ అక్తర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అందులో మూడేళ్ల నిషేధం పై పిసిబి లీగల్ అడ్వైజర్ ను తప్పు తప్పుపట్టాడు అక్తర్. ఈ సందర్భంగా అక్తర్ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. దీనితో అతని వైఖరికి విసుగుచెంది పిసిబి లీగల్ అడ్వైజర్ రిజ్వి ఆయనపై పరువునష్టం కేసును నమోదు చేశారు.


ఏదైనా న్యాయపరమైన అంశాలు మాట్లాడేటప్పుడు అక్తర్ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని తన వైపు నుండి సలహా ఇచ్చాడు. అయితే ఈ విషయంపై పిసిబి కూడా అసంతృప్తిని వ్యక్తం చేసింది. అసలు అక్తర్ బహిరంగా లీగల్ డిపార్ట్మెంట్ తో పాటు తమ అడ్వైజరీ పై తీవ్ర ఆరోపణలు చేయడం ఏమిటి అని ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఇది మంచి పద్ధతి కాదని అతని పై మండి పడింది.

 

అయితే ఇటీవల ఉమర్ అక్మల్ కు అనుకూలంగా షోయబ్ మాట్లాడుతూ తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని విడుదల చేశారు. అందులో ముఖ్యంగా మూడు సంవత్సరాల నిర్ణయాన్ని నిషేధాన్ని ఆయన తోసిపుచ్చారు. అందులో కేవలం పీసీబీ లీగల్ అడ్వైజర్ ఈ అసమర్థత వల్లే కుమార్కు మూడేళ్ల శిక్ష పడిందని తెలిపాడు. అంతేకాకుండా రిజ్వి పై కొన్ని ఆరోపణలు కూడా చేశాడు. కొన్ని సున్నితమైన విషయాల్లో ఆయనకు అనుభవం లేదంటూ ఆయనపై విమర్శలు గుప్పించాడు. నిజానికి పిసిబి అవినీతి నిరోధక విభాగం అతనిపై రెండు నెలలుగా విచారణ కొనసాగుతోంది. అయితే సోమవారం నాడు శిక్షను ఖరారు చేసింది. కాకపోతే అందుకు సంబంధించిన విషయాలను పిసిబి పూర్తిగా వెల్లడించలేదు. పాకిస్తాన్ బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.4.4 ను అధిగమించాడని దర్యాప్తులో తేలడంతో అతనికి మూడేళ్ల నిషేధం విధించాలని పిసిబి తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: