మ్యాచ్ ఫిక్సింగ్ చేసి చాలామంది దొరికిన సంఘటనలు మనం చాలానే చూశాం. నిజానికి ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం పాకిస్థాన్ జట్టులో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే... పాకిస్థాన్ ఆటగాడు సలీం మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్నాడు. అయితే ఆయన 19 సంవత్సరాల తర్వాత తాజాగా అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని అప్పట్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జీవితకాల నిషేధం విధించింది. దీనితో అప్పటి నుంచి ఆ పాకిస్తాన్ ప్లేయర్ సలీం మాలిక్ పూర్తిగా క్రికెట్ కు దూరం అయిపోయాడు. అయితే ఈ మధ్య కాలంలో అతను పాకిస్తాన్ హెడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోగా పీసీబీ వాటిని రిజెక్ట్ చేసింది.

 

అయితే ఆయన తాజాగా మాట్లాడుతూ... 19 సంవత్సరాల క్రితం నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి అంటూ సలీం మాలిక్ తెలిపాడు. ఇప్పుడు కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి ఆ విషయంలో నన్ను సంప్రదించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని, నాకు క్రికెట్ తప్ప మరేమీ తెలియదు అంటూ వాపోయాడు. నిజానికి నేను ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే క్రికెట్ ఆడుతూ పెరిగానని పీసీబీ నాపై విధించిన జీవితకాల నిషేధం పై మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తాడని చెప్పుకొచ్చాడు.


సలీం మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత కొంతమంది పాకిస్థాన్ క్రికెటర్లు కొన్ని సంవత్సరాల పాటు నిషేధానికి గురైన, మళ్లీ తర్వాత కూడా పాకిస్తాన్ జట్టుకు క్రికెట్ మ్యాచ్లు ఆడారు. అయితే ఇందులో మహమ్మద్ అమీర్, సల్మాన్ బట్, షర్జీల్ ఖాన్, మహమ్మద్ ఆసిఫ్ కొద్దిమంది ఈ లిస్టులో ఉన్నారు. అలాగే అంతమంది క్రికెటర్ల పై జీవిత కాల నిషేధం విధించిన పిసిబి ఆ తర్వాత మధ్యలో వారికి కూడా శిక్షణ తగ్గించింది అని తెలిపాడు. కానీ కేవలం నా మీద మాత్రం గత 19 సంవత్సరాలుగా PCB వివక్ష చూపుతోందని ఆయన పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: