ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజాకు షాక్ ఇచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ). వచ్చే12 నెలలకు గాను సీఏ సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ప్రకటించింది. ఇందులో ఖవాజాకు చోటు దక్కలేదు. అతనితో తోపాటు నాథన్ కౌల్టర్ నైల్, పీటర్ హాండ్స్కాంబ్, మార్కస్ హరీస్, షాన్ మార్ష్, మార్కస్ స్టోయినిస్ లకు కూడా ఈసారి కాంట్రాకులను ఇవ్వలేదు. మరోవైపు ఇటీవల ఆస్ట్రేలియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చి  అదరగొడుతున్న మార్నస్ లబుషెన్ మొదటి సారి కాంట్రాక్టు దక్కించుకున్నాడు. అతనితో పాటు బర్న్స్, ఆస్టన్ అగార్ , మిచెల్ మార్ష్, కేన్ రిచర్డ్ సన్, వేడ్ కూడా కాంట్రాక్టులను సొంతం చేసుకున్నారు. 
 
కాంట్రాక్టులను దక్కించుకున్న ఆటగాళ్లు :
 
ఆరోన్ ఫించ్ , డేవిడ్ వార్నర్ , స్టీవ్ స్మిత్ ,లబుషెన్, ట్రెవిస్ హెడ్ , అలెక్స్ క్యారీ ,వేడ్ , మార్ష్ ,స్టార్క్ , కేన్ రిచర్డ్ సన్ ,పాట్ కమ్మిన్స్ ,ఆడమ్ జంపా  ,మార్నస్ లబుషెన్ ,బర్న్స్, ఆస్టన్ అగార్ , మిచెల్ మార్ష్, కేన్ రిచర్డ్ సన్, వేడ్, ప్యాటిన్సన్, నాథన్ లాయన్, హేజెల్ వుడ్ , జై రిచర్డ్ సన్, పైన్, మాక్స్ వెల్ 
 
ఇక ఇదిలావుంటే అక్టోబర్ లో ఆస్ట్రేలియా లో జరగాల్సిన  టీ 20 ప్రపంచ కప్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ మెగా టోర్నీ ని వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వాయిదావేయాలని ఆసీస్ మాజీ ఆటగాళ్లు కోరుతున్నారు. అయితే అటు ఐసీసీ కానీ సీఏ కానీ ఇప్పటివరకు ప్రపంచ కప్ నిర్వహణ పై ఎలాంటి తీసుకోలేదు. ఒకేవేళ అక్టోబర్ వరకు కరోనా ప్రభావం పూర్తిగా తగ్గితే షెడ్యూల్ ప్రకారమే  టోర్నీని నిర్వహించాలని ఐసీసీ భావిస్తుంది. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: