ప్రస్తుతం లాక్ డౌన్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంకో రెండు రోజుల్లో ఈ విధానానికి కొన్ని షరతులతో స్వస్తి పలికపోతున్నారు భారత ప్రభుత్వం. అయితే ఈ లాక్ డౌన్ నేపథ్యంలో అనేక మంది ప్రముఖులు రాజకీయ నేతలు అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండడం జరిగింది. దీనితో చాలా మందికి కాలక్షేపం కాకపోతే వారి ఇంట్లోనే ఎప్పుడూ వెళ్ళని వంటింట్లో కూడా వెళ్లి సమయాన్ని గడుపుతుంటారు అంటే అతిశయోక్తి కాదు. 

 


ప్రస్తుతం ఇదే కోవలోకి భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కూడా చేరిపోయాడు. స్టైలిస్ట్ క్రికెటర్ అజారుద్దీన్ లాక్ డౌన్ సమయంలో కిచెన్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ సంఘానికి అజారుద్దీన్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. క్రికెట్ గ్రౌండ్ లో తనకే సొంతమైన మణికట్టు షాట్లతో క్రికెట్ లవర్స్ ను ఆనందపరచిన అజారుద్దీన్ ఇప్పుడు తన చేతి వేళ్ళతో గరిట తిప్పుతున్నాడు. తన చేత్తో కొత్త కొత్త రుచులను ట్రై చేస్తున్నాడు ఈ మాజీ క్రికెటర్ అజారుద్దీన్.


అయితే క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ తండ్రి కిచెన్ లో ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే మొదటి సారి తన తండ్రిని కిచెన్ లో చూసినట్లు అసద్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా క్రికెట్ బ్యాట్ కు బదులు అతని చేతిలో స్పూన్ ఉందంటూ జోక్ వేశాడు. దీనితో తాను ఎప్పుడూ వంటింట్లో చూడలేదని, కుకింగ్ చేయడం కూడా ఇదే మొదటిసారి అని ఇది నాకు చాలా షాకింగ్ గా ఉందని తెలిపాడు. అయితే దీనికి అజరుద్దీన్ ప్రతి దానికి పస్ట్ టైం ఉంటుంది అని రిప్లై ఇచ్చాడు. అయితే ఈ కరోనా పుణ్యమా అని మోస్ట్ స్టైలిష్ బ్యాట్స్ మెన్ అయినా అజారుద్దీన్ కూడా కిచెన్ రూమ్ లోకి రావడం నిజంగా విడ్డూరమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: