టెస్ట్ క్రికెట్... క్రికెటర్లు ఎవరైనా సరే ఈ ఫార్మేట్ కే ఓటేస్తారు. దీనికి కారణం అందులో ఉండే మజానే. మామూలుగా సుదీర్ఘ చరిత్ర కలిగిన సంప్రదాయ క్రికెట్లో టెస్ట్ క్రికెట్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ టెస్ట్ క్రికెట్లో బంతికి ఉమ్ము కు ఉన్న సంబంధం విడదీయరానిది. టెస్ట్ క్రికెట్ లో వికెట్లు పడగొట్టాలన్న, పరుగుల్ని కట్టడి చేయాలన్న ఈ ఉమ్మును పూసి బాల్ ని బాగా రుద్దడం తో బాల్ ఎక్కువగా స్వింగ్ చేయబడుతుంది. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో ఇది సర్వసాధారణం. ఇక ముఖ్యంగా ఫేస్ పిచ్ కి అనుకూలించే న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలలో టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు బౌలర్లకు అనుకూలంగా ఉండేందుకు బాలుకు ఉమ్ము లేక చెమటతో ఎప్పటికప్పుడు ఇలా చేస్తుంటారు.

 


మాములుగా అయితే కొత్త బంతితో స్వింగ్ చేయవచ్చు. కాకపోతే, బాల్ వాడే కొద్దీ దాని మెరుపు తగ్గి స్వింగ్ చేయడం కష్టమవుతుంది. అయితే బంతి మెరుపు తగ్గకుండా ఉమ్ము తో దాని మెరుపును తెప్పించేందుకు కెప్టెన్ లు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇప్పటి వరకు సర్వసాధారణం ఈ సంగతి. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఈ పరిస్థితులు పూర్తిగా మారాయి. అయితే ఇప్పుడు ఇలా చేస్తే ఏదైనా వైరస్ ఉంటే అది ఇతరులకు చేరుతుందని నేపథ్యంలో దానిపై పెద్ద చర్చ జరుగుతోంది ప్రస్తుతం. దీనితో టెస్ట్ క్రికెట్ లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 

 


ఇక వైరస్ వాహకాలుగా ఉపయోగపడే ఉమ్మిని ఉపయోగించే విషయంలో భిన్నాభిప్రాయాలు తెలుపుతున్నారు పెద్దలు. అయితే ఈ పద్ధతి పై ఉమ్ము, చెమట వాడాలా వద్దా అన్న దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ ఒక ఆలోచన చేయబోతోంది. దీనితో ఇప్పుడు ఐసీసీ, గ్రౌండ్ లోని అంపైర్ల సమక్షంలో బంతిని పాలిష్ చేసే అవకాశం ఉంటుంది అని ఐసీసీ ప్రకటించింది. అయితే ఇందుకోసం ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని టాంపరింగ్ కు ఉపయోగించేలా ఎంపిక చేయాలని ఐసీసీ భావిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మూడు రకాల బంతులను ఉపయోగిస్తుంది ఐసీసీ. అయితే ఈ మూడు రకాల బంతులపై ఈ ప్రభావం ఉండేలా చూడాలని ఐసీసీ భావిస్తోంది. ఇక ముందు చూడాలి ఐసీసీ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో....!

మరింత సమాచారం తెలుసుకోండి: