భారత దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే కి అభిమానులు కాని వారు ఉండరు అనే విషయం తెలిసిందే. కేవలం అనిల్ కుంబ్లే ఆటకు మాత్రమే కాదు ఆయన మంచి మనసుకి  కూడా ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అనిల్ కుంబ్లే ను ఎంతో అమితంగా అభిమానిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. తాజాగా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే పై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అనిల్ కుంబ్లే తనకు ఎంతో ఇష్టం అంటూ తెలిపిన మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అతని కోసం జీవితాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాకుండా గతంలో అనిల్ కుంబ్లే కెప్టెన్సీలో తాను ఆడిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు గౌతం గంభీర్. 

 

 అనిల్ కుంబ్లే భారత క్రికెట్ చరిత్రలో దొరికిన అరుదైన ఆటగాడు అంటూ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించారు. అనిల్ కుంబ్లే ఆడే సమయంలో ఎంఫైర్  నిర్ణయం సమీక్ష పద్ధతి ఉండి ఉంటే తన టెస్ట్ కెరీర్లో ఏకంగా తొమ్మిది వందల వికెట్ల మైలురాయిని చేరుకునే వాడు అంటూ  ఈ సందర్భంగా తెలిపారు గంబీర్ . అయితే జట్టులో తన స్థానాన్ని గురుంచి  తనకు నమ్మకాన్ని కలిగించిన  కెప్టెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం అనిల్ కుంబ్లే మాత్రమే అంటూ గౌతం గంభీర్ వ్యాఖ్యానించారు. భారత టెస్టు ఆల్ టైం ఎలెవన్  జట్టు ను ప్రకటించిన గౌతం గంభీర్... కెప్టెన్ గా  అనిల్ కుంబ్లే ని ఎంచుకున్నాడు. 

 

 

 ఈ జట్టులో మరో దిగ్గజ ఆటగాడు అయిన సునీల్ గవాస్కర్ కు స్థానం కల్పించినప్పటికీ ఆ జట్టుకు కెప్టెన్గా మాత్రం అనిల్ కుంబ్లే ను ఎంచుకోవడం గమనార్హం . 2008లో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్కు ముందు అనిల్ కుంబ్లే తో తనకు ఎదురైన అనుభవాలను కూడా ఓసారి నెమరువేసుకున్నారు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్. నేను సేహ్వాగ్  కలిసి భోజనం చేస్తున్న సమయంలో అనిల్ కుంబ్లే  తమ వద్దకు వచ్చి... ఏం జరిగిన టెస్ట్ సిరీస్లో నాలుగు మ్యాచ్ లలో  ఓపెనర్గా మీరే ఉంటారు.. ఒకవేళ డకౌట్ అయినా పర్వాలేదు అంటూ అనిల్ కుంబ్లే తెలిపాడని.. అలాంటి మాటలు తాను ఇప్పటివరకు ఏ ఆటగాడి నోటి నుండి వినలేదు అంటూ గౌతం గంభీర్ తెలిపాడు .. అనిల్ కుంబ్లే కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం అంటూ గౌతం గంభీర్ అన్నాడు. 

 

 ఇక గౌతం గంభీర్ ప్రకటించిన టీమ్ ఇండియా ఆల్ టైం టెస్ట్ జట్టులో ఆటగాళ్లు...గంభీర్‌ ప్రకటించిన టీమిండియా ఆల్‌టైమ్‌ టెస్టు జట్టు..

అనిల్ కుంబ్లే(కెప్టెన్​), సునీల్ గావస్కర్​, వీరేంద్ర సెహ్వాగ్​, రాహుల్ ద్రవిడ్​, సచిన్ టెండూల్కర్​, విరాట్ కోహ్లి, కపిల్​దేవ్​, ఎంఎస్ ధోని, హర్భజన్‌ సింగ్​,  జహీర్ ఖాన్​, జవగళ్ శ్రీనాథ్

మరింత సమాచారం తెలుసుకోండి: