సౌరబ్ గంగూలీ... ఈ పేరు గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా...? బెంగాల్ టైగర్, దాదా ఇలా ఈయన్ని అనేక పేర్లతో పిలుస్తుంటారు భారత క్రికెట్ అభిమానులు. సౌరబ్ గంగూలీ నాయకత్వంలో టీమిండియా చాలా పరిణితి చెందింది అని చెప్పవచ్చు. సౌరవ్ గంగూలీ నాయకత్వం రానంతవరకూ టీమిండియా విదేశాల్లో మ్యాచ్ గెలిచాము అంటే ఔరా అనిపించుకున్నారు. అయితే సౌరబ్ గంగూలీ ఆ పరిస్థితిని మొత్తాన్ని మార్చేశాడు. టీమ్ ఇండియా జట్టు సభ్యుల్లో నమ్మకాన్ని కూడబెట్టి వారికి వరుసబెట్టి అవకాశాలు కల్పిస్తూ విదేశీ గడ్డపై టీమిండియా పవర్ ఏంటో నిరూపించిన మొదటి కెప్టెన్ సౌరవ్ గంగూలీనే.  

 


సౌరబ్ గంగూలీ తన కెరియర్ లో అనేక మైలు రాళ్లను దాటుకుంటూ ప్రపంచంలోనే పేరుగాంచిన భాగస్వాములు ఎవరు అంటే చెప్పే పేర్లలో సచిన్ టెండూల్కర్ - సౌరవ్ గంగూలీ వీరి పేర్లు మొదటగా చెబుతారు. ఎందుకంటే వీళ్లు ఆడిన మ్యాచ్ లు, వారు చేసిన స్కోర్లు అలాంటివి మరి. అయితే తన కెరియర్లో చివరి రోజుల్లో కాస్త కోచ్ ద్వారా అనేక ఇబ్బందులు పడి చివరికి క్రికెట్ నుంచి వైదొలగిన పరిస్థితి ఏర్పడింది.

 


అలా క్రికెట్ నుంచి బయటకు వచ్చాక ఐపీఎల్లో కొన్ని టీమ్ లకు మెంటల్ గా పని చేస్తూనే, కామెంటేటర్ గా కూడా మనల్ని సౌరబ్ గంగూలీ ఆనంద పరిచాడు. ఇక ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక టీమిండియా ప్లేయర్ బీసీసీఐ అధ్యక్షుడు పదవిని చేపట్టిన ఆటగాడిగా గంగూలీ తన పేరును రాసుకున్నాడు. అయితే ఇక ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితులను ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరబ్ గంగూలీ తనదైన శైలిలో వివరించాడు. ప్రస్తుతం ప్రమాదకరమైన పిచ్ పై టెస్ట్ మ్యాచ్ ఆడినట్లు ఉందని దాదా ఆదివారం జరిగిన ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో గంగూలీ తెలిపాడు. ప్రస్తుతం బంతి స్వింగ్ తో పాటు, స్పిన్ కూడా అవుతుందని ఆయన తెలిపాడు. బ్యాట్స్ మెన్ అవుట్ కాకుండా ఉండేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని, అందుకే స్కోర్ సాధించడంతో పాటు వికెట్ కూడా కాపాడుకోవాలంటే అలాగే టెస్ట్ మ్యాచ్ ను గెలవాలి అని సౌరవ్ గంగూలీ మాట్లాడారు. అంతేకాకుండా ఇది ఒక రకంగా చాలా కష్టమైన పని అయినా మనం గెలుస్తామన్న నమ్మకం నాకుంది అని గంగూలీ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: