ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పై యుద్ధం చేసేందుకు అనేకమంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు ఇలా చాలామంది మన కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ కోవలోకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా భాగస్వాములు కాబోతున్నారు. 

 


ఇక అసలు విషయానికి వస్తే.. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేసేందుకు నిర్వహిస్తున్న ఆన్లైన్ సంగీత కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా కలిసి ఇందులో పాల్గొనబోతున్నారు. " ఐ ఫర్ ఇండియా " చేపడుతున్న ఈ ఈ కార్యక్రమంలో ఎంతో మంది నటులు, గాయకులు, క్రీడాకారులు కొంతమంది బడా వ్యాపారవేత్తలు అలాగే సంగీత దర్శకులు అందరూ పాల్గొని తమ ఇంటి దగ్గర నుండి ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు.

 


ఇలా చేయడం ద్వారా ఏంటి లాభం అనుకుంటున్నారా..? వీటితో వారు నిధులను సమకూర్చబోతున్నారు. అయితే లాక్ డౌన్ లో ఉన్న ప్రజలను కాస్త ఉత్సాహ పరిచేందుకు కరోనా నేపథ్యంపై యుద్ధంలో ముందుండి పోరాటం చేస్తున్న వారి కొరకు ఉపాధి లేకుండా ఇంట్లో ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఈ నిధులను సేకరిస్తున్నట్లు " ఐ ఫర్ ఇండియా " తెలిపింది. అయితే ఇందులో కేవలం కొద్ది మంది మాత్రమే కాకుండా అమీర్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అలియా భట్, షారుక్ ఖాన్, కోహ్లీ భార్య అనుష్క శర్మ, జాకీర్ హుస్సేన్ వీరే కాకుండా సినీ వర్గానికి సంబంధించిన పెద్ద పెద్ద స్టార్లు, అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కొందరు సంగీత దర్శకులు ఈ ఫ్లాట్ ఫాం ద్వారా భాగస్వాములు కాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: