ప్రపంచంలోని అన్ని క్రికెట్ జట్లు టి - 20 ప్రపంచకప్ కు సన్నద్ధం అయ్యేందుకు తగిన సమయం లేకుంటేనే దాని గురించి ఆలోచించాలని ఇంగ్లాండ్ ఆటగాడు తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ సంవత్సరం చివరిలో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ - 20 వరల్డ్ కప్ గురించి జేసన్ రాయ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. కరోనా వైరస్ ప్రభావం తగ్గాక ఆటగాళ్లు మళ్లీ సిద్ధం కావడానికి కేవలం మూడు వారాల సమయం ఉంటే సరిపోతుందని ఒక క్రికెట్ వెబ్ సైట్ కు తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జేసన్ రాయ్.


అయితే దీనికోసం ఆటగాళ్లు సరైన సన్నద్ధత లేకుండా ఆస్ట్రేలియాకు వెళ్లలేని పరిస్థితి ఉన్నా ప్రపంచ కప్ వాయిదా వేస్తే అర్థం ఉంటుంది అని తెలిపాడు. అయితే ఒకవేళ ఆ సమయానికి మూడు వారాల సమయం దొరికితే మాత్రం ప్రపంచకప్ ఆడేందుకు అందరూ సిద్ధంగా ఉండొచ్చు అని తెలిపాడు. అలాగే ఇంగ్లాండ్ టీంలోని ఆటగాళ్ళందరూ దీనికి రెడీగా ఉన్నారని ఇంగ్లాండ్ ప్లేయర్ జేసన్ రాయ్ తెలిపాడు. కాకపోతే కరోనా వైరస్ తీవ్ర ప్రభావం కొనసాగుతుండడంతో ఈ సంవత్సరం చివర అక్టోబర్ 18 నుంచి నవంబర్ నెల 15వ తారీఖు వరకు ఆస్ట్రేలియా వేదిక జరగాల్సిన ప్రపంచ కప్ జరుగుతుందా లేదా అన్న సందేహాలు పెరుగుతున్నాయి.

 

ఇప్పటికే భారతదేశంలో జరగాల్సిన అతిపెద్ద క్రికెట్ టోర్నీ ఐపీఎల్ వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే కేవలం ఐపీఎల్ ఒకటే కాకుండా ప్రపంచంలోని అన్ని రకాల క్రీడలకు సంబంధించిన పెద్ద పెద్ద టోర్నీలు అన్ని కరోనా వైరస్ నేపథ్యంలో రద్దు అవ్వగా, కొన్ని వాయిదా వేయడం జరిగింది. దీనితో ప్రపంచం నలుమూలలా ఉన్న ఆటగాళ్ళందరూ వారి సమయాన్ని కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: