భారత క్రికెట్ ప్లేయర్ సురేష్ రైనా టీమిండియాలోకి మళ్ళీ తిరిగి వస్తాడని ఆంధ్ర రాష్ట్రానికి చెందిన తెలుగు ప్లేయర్ అంబటి తిరుపతి రాయుడు తెలిపాడు. సురేష్ రైనాలో ఎంతో క్రికెట్ దాగుందని రాయుడు తెలిపాడు. తాజాగా తను ఆడుతున్న ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో తనతో సంభాషించింది. అయితే ఈ కార్యక్రమంలో ఈ రాయుడుని కొన్ని ప్రశ్నలు అడగా అతను వాటికి సమాధానాలు ఇచ్చాడు. రైనా తిరిగి మళ్ళీ భారత చేతుల్లోకి ఇస్తాడా అని అడగగా అతను కచ్చితంగా తిరిగి వస్తాడు అని తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ లో చాలా సమాచారం నుండి రాయుడు రైనా ఇద్దరు కలిసి ఆడుతున్నారు.


ఎంఎస్ ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో టీమిండియాలో రైనా కీలక సభ్యుడిగా ఉన్నాడు. నిజానికి ఎవరైనా ఎన్నో మ్యాచ్ లు గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీంలో సురేష్ రైనా కూడా ఉన్నాడు. అయితే గత రెండు సంవత్సరాల నుంచి అతని ఫామ్ సరిగా ఉండకపోవడంతో, దానితో పాటు కొద్ది చిన్నపాటి గాయాలు తదితర కారణాలతో తను తిరిగి ఎంపిక కావడం లేదని తెలిపాడు. అయితే సురేష్ రైనా 2018 లో ఇంగ్లాండ్ సిరీస్ లో చివరిగా ఆడాడు.

 

అయితే ఇక ఆ సిరీస్ లో సురేష్ రైనా గతి తప్పడంతో అప్పటినుంచి రైనాను టీమిండియాలోకి తీసుకోవడం లేదని తెలిపాడు. అయితే రైనా గురించి రాయుడు మాట్లాడుతూ... ఆయన ఒక గొప్ప ఆటగాడని తనలో ఎంతో క్రికెట్ దాగి ఉందని తను కచ్చితంగా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడు అని చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై తాను ఎంతైనా పందెం కాయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా రాయుడు తెలిపాడు. రాయుడు గత కొద్ది కాలం నుంచి మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతుండగా సురేష్ రైనా చాలా సంవత్సరాల నుంచి ఆ జట్టు లోనే కొనసాగుతూ వస్తున్నాడు. సురేష్ రైనా గత సంవత్సరం ఐపీఎల్లో 17 మ్యాచుల్లో 360 కి పైగా పరుగులను సాధించాడు. అంతేకాకుండా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్స్ లో సురేష్ రైనా ఒకడు.

మరింత సమాచారం తెలుసుకోండి: