పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఎప్పుడూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు అనే విషయం తెలిసిందే . ఎప్పుడూ ఏదో ఒక విధమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా లో వైరల్ అవుతు ఉంటాడు . అయితే ఫాస్ట్ బౌలింగ్ లో పాకిస్థాన్ జట్టులో  ఎన్నో రోజుల పాటు తన సేవలను అందించిన షోయబ్ అక్తర్ రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే  ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్లు హవా నడుస్తున్న విషయం తెలిసిందే. క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత కథ ఆధారంగా బయోపిక్ లు  తెరకెక్కిస్తు  మంచి విజయాలను అందుకున్నారు దర్శకనిర్మాతలు. 

 

 

 అయితే తాజాగా ఒకవేళ తన బయోపిక్ తెరకెక్కిస్తే తన పాత్రలో హీరో అయితే బాగుంటుంది అనే ప్రశ్నకి ఆసక్తికర సమాధానం చెప్పాడు అక్తర్. ఒకవేళ నా బయోపిక్ తెరకెక్కిస్తే నా పాత్రలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తప్ప మరెవరూ సెట్ అవ్వరు అంటూ చెప్పేసాడు.. సల్మాన్ ఖాన్ నా పాత్రలో నటిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా అని తెలిపాడు అక్తర్. కాగా సల్మాన్ ఖాన్ ఎన్నో ఏళ్ల  నుంచి విజయవంతంగా దూసుకుపోతున్నాడు. యాక్షన్ సినిమాలకు సల్మాన్ ఖాన్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో కూడా నటించాడు. కాగా ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే  షోయబ్ అక్తర్ తాజాగా తన బయోపిక్ లో తన పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తే  బాగుంటుంది అని చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీనిపై నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు అని చెప్పాలి. 

 

 

 మరి సల్మాన్ ఖాన్ దీనిపై ఎలా స్పందిస్తాడు. షోయబ్ అక్తర్ బయోపిక్లో అక్తర్ పాత్రలో నటించడానికి సల్మాన్ ఖాన్  ఓకే చేస్తాడా... మీడియా షోయబ్ అక్తర్ వ్యాఖ్యలను సల్మాన్ ఖాన్  వరకు తీసుకెళ్తుంది... దీనిపై సల్మాన్ ఖాన్ ఎలా స్పందిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ ఎక్కువగా బయోపిక్ ల జోలికి వెళ్ళలేదు అన్న విషయం తెలిసిందే. తనదైన యాక్షన్ సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు సల్మాన్ ఖాన్. మరి అలాంటి సల్మాన్ ఖాన్ షోయబ్ అక్తర్ పాత్రలో చేస్తాడా చేయడ తెలియాలి అంటే దీనిపై సల్మాన్ ఖాన్ స్పందించాల్సి ఉంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: