పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఒక ప్రముఖ యాప్ నిర్వహించిన లైవ్ షోలో కొన్ని ఆసక్తికర విషయాలను తన అభిమానులతో పంచుకున్నాడు. నిజానికి ఈ మధ్య షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ క్వారంటైన్ టైం సమయం మొదలైన దగ్గర నుంచి మరీ ఎక్కువగా సోషల్ మీడియాలో  పోస్టులు చేస్తూ కనిపిస్తున్నాడు షోయబ్ అక్తర్. ఇక అసలు విషయానికి వస్తే... కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకి చాలా ఓపికగా సమాధానాలు చెప్పాడు షోయబ్ అక్తర్. 

 

 

ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి తొలత తనకు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ మాత్రమే స్నేహితులని షోయబ్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ తర్వాత టీమిండియా జట్టులోని సభ్యులు అందరూ తనకు స్నేహితులని ఆయన చెప్పుకొచ్చాడు. దానితో పాటు ఆ లైవ్ షోలో తన క్రికెట్ కెరీర్ కు సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఇక భారత్ ప్లేయర్ల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం భూమి మీద ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ బౌలర్ అని షోయబ్ అక్తర్ తెలిపాడు. అంతే కాకుండా బెస్ట్ ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యా ఎదిగే అవకాశం ఉందని ఆయన తెలిపాడు.

 


అంతేకాకుండా ఒక అభిమాని కొన్ని ప్రశ్నలు రాపిడ్ ఫైర్ గా శారద అడిగిన ప్రశ్నలకీ అక్తర్ చెప్పిన సమాధానాలు ఇలా ఇచ్చాడు. ఉత్తమ బౌలర్ - ఇమ్రాన్ ఖాన్ లేదా వసీం అఖ్రామ్ అని అడగగా వసీం అక్రమ్ అని, ఉత్తమ బ్యాట్స్మెన్ ఇంజామామ్ లేదా యునిస్ ఖాన్ అంటే ఇంజామం, బౌలింగ్ చేయడానికి మీకు కష్టతరమైనది ద్రవిడ్ లేదా సచిన్  అని అడగగా ద్రవిడ్ అని, భారత జట్టులో మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరూ ? భజ్జీ, యువరాజ్… మిగితావాళ్లూ కూడా మంచి మిత్రులే అని.. ఉత్తమ ఆల్ రౌండర్ ఫ్లింటాఫ్ లేదా అఫ్రిది అడగగా జాక్ కలిస్ అని అన్నాడు. అయితే ఇప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ ఆల్ రౌండర్ ఎవరు? అని అడగగా హార్దిక్ పాండ్యా అని చెప్పాడు. ఇక మీరు కోచ్ చేయాలనుకుంటున్న ఒక ఐపిఎల్ జట్టు? అంటే KKR అని అన్నాడు.‌ ప్రస్తుత తరం యొక్క ఉత్తమ బౌలర్ - బుమ్రా, స్టార్క్, ఆర్చర్  లలో అడగగా బుమ్రా అని సంధానం ఇచ్చాడు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: