ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం  ఎక్కువ ఉండటం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో లాక్ డౌన్  అమలు అవుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్  అమలవుతున్న నేపథ్యంలో సినిమా షూటింగులు క్రీడలు అన్ని నిలిచి  పోయాయి. దీంతో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ముఖ్యంగా ఎప్పుడూ మైదానంలో కనిపిస్తూ ప్రాక్టీస్ చేసే ఆటగాళ్లందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే ఆటగాళ్లందరూ ఇప్పుడు ఫ్యామిలీ తో సమయం గడుపుతున్నారు. అంతేకాకుండా ఒక్కో ఆటగాడు ఒక్కో విధంగా లాక్ డౌన్  సమయాన్ని గడుపుతున్నారు . ముఖ్యంగా డేవిడ్ వార్నర్ అయితే సోషల్ మీడియాలో లాక్ డౌన్  విధించినప్పటి నుంచి ఎంతో ఆక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. 

 


 తాను ఏ చిన్న పని చేసినా అది సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉండడంతో అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది . ముఖ్యంగా డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ యాప్ అయినా టిక్ టాక్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. కూతుర్లు భార్యతో కలిసి తెగ డాన్సులు చేసేస్తున్నాడు డేవిడ్ వార్నర్. అయితే ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అయినపించ్  డేవిడ్ వార్నర్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ టిక్ టాక్ లో చేస్తున్న డాన్స్ వీడియోలు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్న పించ్  తాను కూడా వాళ్ల ఎందుకు చేయలేను అని అనుకున్నాడో  ఏమో... వెంటనే టిక్ టాక్ లో డాన్స్ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. 

 

 వెంటనే టిక్ టాక్ ఇన్స్టాల్ చేసి తన ఖాతాను తెరిచి డాన్సులు చేయడం ప్రారంభించాడు ఆరోన్ ఫించ్. అయితే డాన్స్ అంటే అది ఒక కల. కేవలం చేతులను మాత్రమే ఆడిస్తే సరిపోదు కదా. అందుకే బాడీ మోమెంట్స్ ను కూడా ప్రయత్నించాడు. ఇక మూమెంట్స్ అనుకున్నంత మంచిగా రాకపోవడంతో డాన్సు ఆపేసాడు... ఇక ఆ వీడియోని టిక్ టాక్ లో పోస్ట్ చేస్తూ నా వయసు 30 దాటిపోవడంతో డాన్స్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది.. ఇక డాన్స్ చేస్తూ టిక్ టాక్ లో వీడియో తీయడం ఇంకా ఇబ్బంది గా మారిపోయింది... నా మిత్రుడు వార్నర్ లాక్ డౌన్  బాగా ఎంజాయ్ చేస్తున్నాడు..  నా కంటే పెద్దవాడు అయినప్పటికీ డాన్సుల్లో మాత్రం ఇరగదీసేస్తున్నాడు... నేను కూడా అలాగే చేద్దాం అనుకున్నప్పటికీ కుదరలేదు... నా వరకైతే డాన్స్ కంటే క్రికెట్ అంటేనే నాకు సులభంగా ఉంటుంది అంటూ... క్యాప్షన్ ఇస్తూ ఒక వీడియో ని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Over 30 and trying to dance on TikTok. Might stick to cricket 😳 #quarantinelife

A post shared by Aaron Finch (@aaronfinch5) on

మరింత సమాచారం తెలుసుకోండి: