ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సంచలనం సృష్టిస్తోంది. రోజురోజుకి ఈ వైరస్ విజృంభనతో కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇక ఇందు కోసం నిరంతరం శ్రమిస్తున్న వారికోసం ఆర్థిక సహాయం చేసేందుకు చాలా మంది ప్రముఖులు ముందుకు వస్తూ వాళ్ళ మానవత్వాన్ని చాటుకోవడం జరిగింది. ఇక సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరూ కూడా వారే ఎంతో సహాయం చేయడానికి ముందస్తులో ఉన్నారనే చెప్పాలి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🌈🌈🌈 link in my story SWIPE UP

A post shared by Ben Stokes (@stokesy) on

ఇక ఇది ఇలా ఉండగా ఈ మహమ్మరి పై యుద్ధం చేస్తున్న ఆస్పత్రులకు ఆర్థిక సహాయం అందజేసేందుకు ఇంగ్లాండ్ స్టార్ అల్ రౌండర్ బెన్ స్టోక్స్ తొలిసారిగా హాఫ్ మారథాన్ ( 21 km ) పరిగెత్తడం జరిగింది. ఇక దీని ద్వారా వచ్చిన నిధులను బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవలతో పాటు, పిల్లల క్రికెట్ కోసం స్థాపించిన చాన్స్ టు ఫైండ్ ఫౌండేషన్ కు అందజేశాడు. ఇకపోతే, ఈ విషయాన్ని హాఫ్ మారథాన్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని అభిమానులతో పంచుకోవడం జరిగింది. 

 

ఇక హాఫ్ మారథాన్ ఎప్పటినుంచో చేయాలని ఆలోచిస్తున్నా... కానీ ఇంతవరకు ఎన్నడు చేయలేదు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్న కారణంతో హాఫ్ మారథాన్ కు ఒక మంచి అవకాశం కల్పించింది. అంతేకాకుండా నిధులు సమకూర్చేందుకు కూడా అవకాశం ఉంటుంది అనే ఆలోచనలో ఈ విధంగా చేశాడు. క్రికెట్ గార్డెన్ మారథాన్​ కు ప్రజలు అధిక సంఖ్యలో విరాళాలు సమకూర్చాలని మనస్ఫూర్తిగా కలిగిస్తానని  విరాళాలు ఇచ్చేలా నేను స్ఫూర్తి కలిగిస్తానని ఆశతో ఉన్నాఅంటూ స్ట్రోక్స్ తెలియజేశాడు.


ఇక గత సంవత్సరం 2019 లో ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ ను ఇంగ్లాండ్ గెలవడంతో బెన్ స్టోక్స్ ఎటువంటి పాత్ర వహించాడో మళ్లీ ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా  విరాళాల కోసం బెన్ స్టాక్స్ ఒక మంచి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: