ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ భారత జట్టు సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అని... భారత జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలియజేశాడు. ఇక అశ్విన్ ఎక్కువ వికెట్లు తీసేందుకు ఫిట్నెస్ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని అని హర్భజన్ సింగ్ తెలియజేశాడు. ఇక వీరిద్దరూ కూడా ఇటీవల ఇంస్టాగ్రామ్ లైవ్ లో సరదాగా వాళ్ల సమయాన్ని కేటాయించారు.

 

హర్బజన్ మాట్లాడుతూ.... మన ఇద్దరి మధ్య చాలా ఈర్ష ఉందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటివి ఏమీ లేవు అని నేను అందరికీ తెలియజేస్తున్నాను అని తెలిపాడు. ఇక అశ్విన్ అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ అని.. ఆస్ట్రేలియా పిచ్లపై అశ్విన్ దిగ్గజంగా మారుతాడు అంటూ కొనియాడాడు. అంతేకాకుండా అత్యధిక టిక్కెట్ల రికార్డును సొంతం చేసుకునే సత్తా అశ్విన్ లో ఉంది అంటూ హర్బజన్ తెలియజేశాడు.

 

మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ ...  నేను చెపాక్ టెస్ట్ కు నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు. జట్టులో సభ్యుడిగా ఉండేవాన్ని లేకపోతే స్టేడియంలో ఒక ప్రేక్షకుడిగా టెస్టును వీక్షించే వాడిని. అంతేకాకుండా ఆ టెస్ట్ సమయములో నేను స్టేడియంలో ఉన్నాను. మీరు హేడన్ క్యాచ్ ను మిస్ చేసినప్పుడుబహుతులే వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పడం నేను చూశాను అని అశ్విన్ తెలియజేశాడు. అంతే కాకుండా ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఉండే గేమ్స్ స్పిరిట్ గురించి మా నాన్న ఎప్పుడూ నాకు చెప్తూ ఉండేవాడు. ఆ సమయం లో అది నాకు గుర్తుకు వచ్చింది.. అంతేకాకుండా ఆ ప్రభావం నా మీద చూపింది అని రవీంద్ర అశ్విన్ మరోసారి గుర్తు చేయడం జరిగింది.

 

కేవలం అదే కాకుండా భారత మహేంద్రసింగ్ ధోనీకి టీ - 20ల్లో బౌలింగ్ చేయడం చాలా కష్టమని అశ్విన్ తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా భారత్ ఇప్పటి వరకు ఎన్నడూ చూడని గొప్ప కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అని అశ్విన్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: