మొన్నటి వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగిన విషయం తెలిసిందే. దాదాపు 40 రోజుల పాటు దేశం మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయింది  రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. సినిమా షూటింగ్ లు  ఆగిపోయింది. ప్రజలు ఇంటి నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాలను జోన్ల వారీగా విభజించి సడలింపులు  ఇస్తున్న విషయం తెలిసిందే. గ్రీన్ ఆరెంజ్ రెడ్ అంటూ మూడు జోన్లుగా విభజించి గ్రీన్ ఆరెంజ్ జోన్ లలో  సడలింపు ఇస్తున్నాయి.రెడ్ జోన్ లో  మరింత కఠిన నిబంధనలు అమలు చేసేందుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. 

 

 

 అయితే  గత 40 రోజుల నుండి మద్యం షాపుల కోసం  ఎంతోమంది నిరీక్షణ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు గ్రీన్ ఆరెంజ్ లో మద్యం షాపులు తెరుచుకుంటూ ఉండడంతో చాలామంది మద్యం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా ప్రధాన కోచ్ అయిన రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మద్యం షాపులు తెరుచుకోగానే వెంటనే బీరు తెచ్చుకుంటాను. మద్యం షాపుల వద్ద చాలా మంది భౌతిక దూరం పాటించకుండా ఎగబడుతున్నారు.తాను  మాత్రం తప్పకుండా భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కు ధరించి మద్యం షాపులకు వెళ్లి మద్యం తెచ్చుకుంటాను అంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను ఇద్దరితో కలిసి బీర్ తాగే అవకాశం ఉంటే రోజర్ బిన్నీ,  లక్ష్మణ్ శివరామకృష్ణన్ లతో కలిసి తాగుతాను అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు టీమిండియా ప్రధాన కోచ్గా రవి  శాస్త్రి.  

 

 

 ఇదే సందర్భంలో 1985లో ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ తో జరిగిన పోరు గుర్తుచేసుకున్నాడు రవి  శాస్త్రి . ఈ మ్యాచ్లో రవిశాస్త్రి ఆఫ్ సెంచరీ చేసి  మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదే సందర్భంలో తాను మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో పాకిస్తాన్ ఆటగాడు  మియాందాద్ తనను స్లెడ్జింగ్ చేశాడని తెలిపాడు రవిశాస్త్రి. ఆ మ్యాచ్ లో  పాకిస్తాన్ పై విజయం తన జీవితంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకం అంటూ తెలిపాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా మియాందాద్  నిలిచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ..అతనికి  మాత్రం అవకాశం దొరకలేదు అంటూ  రవిశాస్త్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: