యువరాజ్ సింగ్  పేరు వినని భారతీయుడు ఉండడు. క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సెలబ్రిటీ  యువరాజ్ సింగ్.2007 టీ20 ప్రపంచకప్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది తన సత్తా చాటాడు  యువరాజ్ సింగ్.. అంచలంచలుగా  భారత క్రికెట్‌లో సూపర్ స్టార్‌గా ఎదిగాడు యూవీ. 

 ఆ తర్వాత 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ కెరీర్ బెస్ట్ ప్రదర్శనని కనబర్చాడు మన  యువీ.. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు.అయితే ఇంతటి స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న యువరాజ్ కి సరయిన ఘనతగా దక్కలేదని  తండ్రి  యోగరాజ్ సింగ్  అభిప్రాయపడ్డారు.అయన ఇలా అభిప్రాయ పడడానికి కారణం లేకపోలేదు. వివరాలలోకి వెళితే..  టీమిండియాకి యువరాజ్ సింగ్ నాయకత్వం వహించి ఉండాల్సిందని అతని తండ్రి యోగరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ధోనీ కంటే ముందే భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్.. తన నిలకడతో కెప్టెన్సీ రేసులో నిలిచాడు. కానీ.. అనూహ్యంగా ధోనీకి ఆ అవకాశం దక్కగా.. అతని కెప్టెన్సీలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ఆడిన విషయం తెలిసిందే.

 

ఈ రెండు టోర్నీల్లోనూ టీమిండియా విజేతగా నిలవడంలో యువీ కీలక  పాత్ర పోషించగా యువరాజ్ సింగ్ కి  దక్కాల్సిన గౌరవాన్ని ధోనీ దక్కనివ్వలేదని గత కొంతకాలంగా యూవీ తండ్రి యోగరాజ్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ మాట్లాడిన వీడియోలను ఇటీవల చూశాను. ప్రతి ఒక్కరూ ధోనీ గురించి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదో ఒకటి నెగటివ్‌గా మాట్లాడారు. కానీ.. సౌరవ్ గంగూలీ గురించి అలా ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు..? గంగూలీ కెప్టెన్ బాధ్యతలు అందుకునే సమయానికి టీమ్ నెం.7 ర్యాంక్‌లో ఉండేది. కానీ.. యువరాజ్, మహ్మద్ కైఫ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, సెహ్వాగ్, గంభీర్ తదితర యువ క్రికెటర్లతో అప్పట్లో జట్టుని అతను సిద్ధం చేసుకున్నాడు. వాస్తవానికి గంగూలీ తర్వాత యువరాజ్ కెప్టెన్ కావాల్సింది. కానీ.. విధి మహేంద్రసింగ్ ధోనీని కెప్టెన్‌ని చేసింది’’ అని యోగరాజ్ సింగ్ వెల్లడించాడు.

 

ఒకానొక టైమ్ లో యువరాజ్ సింగ్ జట్టుకి చాలా బలాన్ని చేకూర్చాడు. కానీ తర్వాత కాన్సర్ బారిన పడి కొన్నాళ్ళు ఆటకు దూరం అయ్యాడు. తర్వాత మళ్ళీ జట్టు లోకి రీఎంట్రీ ఇచ్చిన గాని మునుపటిలా ఆటలో నిలదొక్కుకోలేకపోయాడు. అయితే 2019 వన్డే ప్రపంచకప్‌లోయూవీకి  చోటు దక్కలేదు.అయితే గత  ఏడాది టోర్నీ జరుగుతున్న సమయంలోనే యువీ రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులని నిరాశపరిచాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: