ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నేపథ్యంలో క్రీడా రంగం అంత స్తంభించింది అని తెలిసిన విషయమే. దీనితో అన్ని ఆటలకు సంబంధించిన ఆటగాళ్లందరూ వారి ఇంట్లోనే ఉంటూ సమయాన్ని పూర్తిగా కుటుంబానికి కేటాయించారు. ఈ సమయాన్ని వారు పూర్తిగా ఆస్వాదిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలోనే భారత్ లో జరగవలసిన అతిపెద్ద క్రికెట్ పండుగ ఐపీఎల్ 13వ సీజన్ కూడా వాయిదా పడింది. ఇంట్లోనే ఉంటున్న ప్లేయర్లు సామాజిక మాధ్యమాల్లో మాత్రం కాస్త టచ్ లో ఉంటున్నారు. అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్లైన్ లోకి వచ్చి వారి అభిమానులను పలకరిస్తున్నారు.

 


అయితే తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని టీవీ వ్యాఖ్యాత సప్రూతో లైవ్ చాట్ జరిగింది. అయితే ఇందులో భాగంగా అభిమానుల నుంచి సేకరించిన కొన్ని ప్రశ్నలకు కోహ్లీ సమాధానం ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఇంతకుముందు ఫామ్ ను అందుకోవాలంటే కనీసం నెల రోజుల ప్రాక్టీస్ అయిన అవసరమని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని ఒక ప్రశ్నకు కోహ్లీ సమాధానమిస్తూ నేను ఈ బ్రేక్ సమయంలోనూ చాలా పాజిటివ్ గా ఉన్నాను, మళ్లీ నేను గేమ్ లోకి రాగానే క్రిందటి తరహాలోనే నేను ఆడుతాను అని నమ్మకం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా " ఎక్కడ ఆపానో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతా" అని విరాట్ కోహ్లీ తన సమాధానం బలంగా చెప్పాడు. లాక్ డౌన్ కారణంతో ఇంట్లోనే ఉంటున్న సానుకూల దృక్పథంతోనే ముందుకు వెళ్తున్న అని కోహ్లీ తెలిపాడు.

 


అయితే ఈ వైరస్ కారణంగా గత రెండు నెలల నుంచి క్రికెటర్లు అందరూ ఆటకు దూరంగా ఉంటున్నారు. దీనితో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో టచ్ పోయింటుందని భారత ప్లేయర్ రోహిత్ శర్మ, మహమ్మద్ షమీ, అజింక్యా రహనేలు అన్న విషయం తెలిసిందే. వారందరూ వారి ఫామ్ తిరిగి పొందాలనుకుంటే కనీసం నెల రోజుల సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం తాను ఇప్పటికీ మంచి పొజిషన్ లోనే ఉన్నాను అని చెబుతూనే నేనెప్పుడూ ఆశావహంగా ఆలోచిస్తా అని ఎలాంటి నెగిటివ్ ఆలోచనలను దగ్గరికి రానివ్వను అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: