కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి క్రీడా రంగం పూర్తిగా స్తంభించింది అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో చిన్న చిన్న టోర్నమెంట్లు మొదలవడం జరుగుతోంది. అయితే ఈ మూడు నెలలు ప్రపంచం మొత్తం అన్ని రంగాల టోర్నమెంట్లు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. దీనితో ప్రపంచంలోని అందరు క్రీడాకారులు వారి వారి ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ ఆటలతో బిజీగా గడిపే జీవితాన్ని ఈ మూడు నెలలు వారు వారి కుటుంబానికి కేటాయిస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.


ఇకపోతే అసలు విషయానికి వస్తే... ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రేక్షకులు లేకుండానే జరగవచ్చని ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ చీఫ్ బెర్నార్డ్ గుడిసెలి తెలిపారు. ఈ నెలలో జరగవలసిన టోర్నీని ఎవరిని సంప్రదించకుండా సెప్టెంబర్ నెల 25 తారీకు నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు వాయిదా వేసిందని టెన్నిస్ సంఘంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ విషయంపై మేము చింతించడం లేదని బెర్నార్డ్ తెలపడం జరిగింది.


ప్రపంచంలో లక్షల మంది ఈ టోర్నీ కోసం వేచి చూస్తున్నారు. అయితే ప్రేక్షకులు లేకుండా నిర్వహించడం కూడా ఒక రకమైన వ్యాపారం నమూన అని తెలిపారు. ఇక ప్రసార హక్కుల ద్వారా కూడా ఆదాయం ఎక్కువగా వస్తుందని ఆయన తెలిపారు. ఇదే నేపథ్యంలో ప్రతి సంవత్సరం టెన్నిస్ లో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే వింబుల్డన్ టోర్నీ ఇప్పటికే రద్దు అవ్వగా ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం సెప్టెంబర్ నెలలో వాయిదా పడింది. ఈ దెబ్బతో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13వ తారీకు వరకు జరగాల్సిన యూఎస్ ఓపెన్ నిర్వహణ ఎటు తేలని పరిస్థితుల్లో పడింది. ఏదిఏమైనా ప్రేక్షకులు లేకుండా క్రీడాకారులు వారి ఆటను ఆస్వాదించడం కాస్త నిరాశ పరచే విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: