భారతదేశంలో దాదాపు 45 రోజుల వరకు లాక్ డౌన్ విధానాన్ని పూర్తిగా అమలు చేసారు. ఆ సమయంలో ఎవరైనా సరే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి. చిన్న, పెద్ద, డబ్బులు ఉన్నోళ్లు, పేదవారు ఇలా అని తేడా లేకుండా అందరూ ఇంట్లోనే ఉంటూ క్వారంటైన్ ను అందరూ పాటించారు. అయితే ఇక మూడో విడత లాక్ డౌన్ సందర్భంగా కొన్ని ప్రదేశాల్లో షరతులతో కూడిన కొన్నిటికి విముక్తి కలిగించారు.

IHG

 

ఈ లాక్ డౌన్ ఈ విధానం ద్వారా నిజానికి మధ్యతరగతి, పేద వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక రోజువారి కూలి పని చేసుకునే వారి సంగతి చెప్పక్కరలేదు. కొందరు దాతలు సహాయం వల్ల ఎంతోమంది భోజనం కూడా చేయగలిగారు. అసలు విషయానికి వస్తే... భారత బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ కు తెలంగాణ అధికారులు క్వారంటైన్ స్టాంప్ వేశారు. ఆ స్టాంప్ గాను గోపీచంద్ 28 రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని ఆయనకు అధికారులు సూచించారు.

 


అయితే ఆయన కొన్ని అనుమతులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు వస్తుండగా రెండు రాష్ట్రాల బార్డర్ అయిన సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం తెలంగాణ సరిహద్దు మీదుగా ఆయన ప్రయాణం చేసారు. అయితే అక్కడ తెలంగాణ అధికారులు కారును ఆపడంతో గోపీచంద్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల్లో కరోనా వైరస్ లక్షణాలు లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 28 రోజుల పాటు స్వీయ గృహనిర్బంధం లోనే ఉండాలని ఆదేశిస్తూ గోపీచంద్ చేతికి క్వారంటైన్ స్టాంప్ వేసినట్లు కోదాడ మండల వైద్యాధికారి కళ్యాణ్ చక్రవర్తి ఈ విషయాన్ని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: