పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గురించిన విషయంలో నోరుజారిన పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిన విషయమే. ఇకపోతే కొంతకాలంగా PCB లో సంస్కరణల గురించి పెద్ద ఎత్తున సూచనలు చేస్తున్న సోహెబ్ అక్తర్.. లోని రోజుల క్రితం ఉమర్ అక్మల్ ‌‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ,యూదు సంవత్సరాల నిషేధం విధించడంపై ఆయన పెదవి విరిచాడు. గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలు తనని సంప్రదించిన విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారుల వద్ద దాచిన ఉమర్ అక్మల్ ‌పై ఇటీవల నిషేధం పడిన సంగతి అందరికి తెలిసిందే.

 


కాకపోతే ఆ నిర్ణయం ఓ పనికిమాలినదని షోయబ్ అక్తర్ ఎద్దేవా చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిన షోయబ్ అక్తర్‌కి.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు న్యాయ సలహాదారు తఫాజుల్ రిజ్వి పరువు నష్టం ఆయనపై నోటీసులు పంపాడు. వెంటనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆ నోటీసులో రిజ్వి డిమాండ్  చేసాడు. ఒక ఛారిటీకి రూ.కోటి విరాళంగా ఇవ్వాలని కూడా అందులో సూచించాడు. ఇకపోతే ఆ నోటీసులు అర్థరహితమని తాజాగా షోయబ్ అక్తర్ వాటిని పట్టించుకోలేదు.

 

 

ఇకపోతే తాజాగా ఆయన ‘‘పాకిస్థాన్ క్రికెట్ బోర్డు‌ పనితీరు మెరుగయ్యేందుకు మాత్రమే నేను ఇలా కాస్త ఘాటుగా సూచనలు చేశాను అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. ఇక అది కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ఏం జరుగుతుందో..? ప్రజలకుకి తెలియాలనే తప్ప మరో ఉద్దేశంతో కాదని, నాకు నోటీసులు జారీ చేసి రిజ్వి నన్ను అవమానించాడు అని, కాబట్టి అతనే నాకు తొలుత క్షమాపణలు చెప్పాలి’’ అని షోయబ్ అక్తర్ డిమాండ్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: