అర్జున అవార్డు.... ఈ అవార్డును భారతదేశంలో క్రీడా రంగంలో అత్యధిక ప్రభావం చూపిన క్రీడాకారునికి ఇస్తారు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సంవత్సరము ఇందుకుగాను అనేక క్రీడా రంగాల నుంచి పేర్లు ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇక క్రికెట్ రంగం నుంచి ఒకే ఒక పేరును టీమిండియా ప్రభుత్వానికి తెలియజేసింది. అతనెవరో కాదు పరిమిత ఓవర్ల ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా. అవును మీరు విన్నది నిజమే... గత సంవత్సరం 2019 లో అర్జున అవార్డుకు బూమ్రా పేరును కేంద్ర క్రీడల శాఖ నామినేట్ చేయగా అయితే అదే లిస్టులో ఉన్న సీనియర్ ప్లేయర్ అయిన రవీంద్ర జడేజాకు ఆ పురస్కారం దక్కింది.

 


అయితే ఇప్పుడు ఆ లిస్టులో బూమ్రా కు పోటీ ఇచ్చే ప్లేయర్ ఎవరూ లేకపోవడంతో అతనికి ఈ అవార్డు దక్కుతుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం అర్జున అవార్డు పొందేందుకు కావలసిన అన్ని అర్హతలు కలిగి ఉన్నాయని అతడే ప్రధాన పోటీదారుడు అని తెలుస్తోంది. దీనికి కారణం ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాక గత సంవత్సరం సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ వివిధ దేశాల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం కూడా అతనికి కలిసొచ్చే అంశం. ఇలా వివిధ దేశాల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఆసియా ఖండంలో ఏకైక బౌలర్ గా బూమ్రా ఉన్నాడు అని ఒక అధికారి తెలపడం జరిగింది. ఇక అలాగే టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరు కూడా ఈ లిస్టులో నామినేట్ చేయడం జరగవచ్చని తెలుస్తోంది. ఒకవేళ శిఖర్ ధావన్ పేరు వచ్చిన గత కొంత కాలంగా తాను గాయం కారణంగా క్రికెట్ కు దూరంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి బూమ్రా కే ఈ అవకాశం దక్కుతుందని అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: