విరాట్ కోహ్లీ... ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. విరాట్ కోహ్లీ కెప్టెన్ అయినప్పటి నుంచి గత న్యూజిలాండ్ టీంతో జరిగిన టెస్ట్ సిరీస్ మినహాయించి మిగతా అన్ని సిరీస్ లలో విజయాన్ని అందించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. 


అయితే ఇన్ని విజయాలు అందించిన విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ దూకుడు వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని అయితే తన కెప్టెన్సీని మిగతా వారితో పంచుకునేందుకు అంతగా ఆసక్తి చూపించడు  ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుకు లాగా ఫార్మేట్ కు ఒక కెప్టెన్  ఉండేలాగా టీమిండియాకు అలా సాధ్యపడదని అన్నారు. అయితే గత సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ మ్యాచ్ లో తుది జట్టు ఎంపిక పై పొరపాట్లు జరిగిన ఈ పరిస్థితుల్లో ఫార్మేట్ కు ఒక కోచ్ కూడా ఉంటే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.


నజీర్ హుస్సేన్ తాజాగా బుధవారం ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.... కెప్టెన్సీని షేర్ చేసుకోవడం అనేది వారి స్వభావంపై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. ఇకపోతే విరాట్ కోహ్లీ ఎక్కడైనా తన మాటే నెగ్గాలనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, అలాగే కెప్టెన్సీని తను పంచుకోవడం అనేది కష్టమని తెలిపారు. నిజానికి విరాట్ కోహ్లీ తన బాధ్యతలు పంచుకునేందుకు ఇష్టపడని తెలియజేశాడు. ఇదే విషయంపై ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ లో ఇయాన్ మోర్గాన్, రూట్ రూపంలో ఇద్దరి కెప్టెన్లు బాధ్యతలు వహిస్తున్నారు. ఇక కెప్టెన్సీ విషయంలో వీరిద్దరికీ ఇక్కడ అభిప్రాయ భేదాలు లేవు అని నాజిర్ హుస్సేన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: