ప్రస్తుతం టీమిండియా ఖాతాలో రెండు వన్డే ప్రపంచ కప్ లు, ఒక టి20 ప్రపంచ కప్ ఉన్నాయి. అయితే ఇక తొందరలో ఒక వన్డే, 20 ప్రపంచకప్ లు జరగనున్నాయి. ఇలా మొత్తం మూడు ప్రపంచకప్ లలో కనీసం రెండు ప్రపంచ కప్ లు టీమ్ ఇండియా గెలుస్తుందని స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ జోస్యం చెప్పాడు. భారత మరో బ్యాట్స్మెన్ అయిన సురేష్ రైనాతో రోహిత్ శర్మ తాజాగా ఇంస్టాగ్రామ్ లో మాట్లాడిన పలు విషయాలను అభిమానులతో రోహిత్ శర్మ పంచుకున్నాడు. 

 

నిజానికి ప్రపంచ కప్ గెలవడం అంటే అంత సులభం కాదు. అయితే ప్రపంచ కప్ గెలవడం అద్భుతమైన ఫీలింగ్ అని టోర్నమెంట్ తో  భావోద్వేగాలు ఎన్నో ఉంటాయని రోహిత్ శర్మ తెలుపక వచ్చాడు. ఆ టోర్నీ అమాంతం పది, పదకొండు జట్లను ఓడించి గెలవడం అంత సులభమేమీ కాదని అయితే అలా జరిగితే మాత్రం ఆ అనుభూతి మాత్రం మాటల్లో చెప్పలేమని రోహిత్ శర్మ తెలిపాడు. ఇకపోతే 2019 ప్రపంచ కప్ లో టీమిండియా ఓడిపోవడం చాలా బాధ కలిగించింది అని రోహిత్ శర్మ తెలిపాడు. అయితే ఐసీసీ త్వరలో 3 మెగా టోర్నీలను నిర్వహించబడుతుంది. రెండు టి20 ల ప్రపంచ కప్ లు, ఒక వన్డే వరల్డ్ కప్ జరగబోతున్నాయి. అయితే ఇందులో భారత్ కనీసం రెండు గెలుస్తుందని రోహిత్ శర్మ తెలిపాడు. మూడింటికి మూడు గెలిస్తే ఇంకా మంచిదని కూడా తన అభిప్రాయపడ్డాడు.

 

ప్రస్తుతం మన టీమిండియా ఉన్న సామర్థ్యాన్ని బట్టి కనీసం 2 కప్స్ అయినా గెలవాలి అని ఈమాట ఇప్పటికే చాలా సార్లు చెప్పాను అని కూడా రోహిత్ శర్మ పేర్కొన్నాడు. టీమిండియా వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఇంతవరకు ఒక్క icc టోర్నీ టైటిల్ కూడా గెలవలేదు. టీమిండియా వన్డే ప్రపంచకప్ రెండోసారి గెలిచి ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది అంటే నమ్మశక్యంగా ఉందా మీకు...?

మరింత సమాచారం తెలుసుకోండి: