కరోనా వైరస్ పుణ్యమా అని క్రీడాకారులు అందరు ఇంటికే పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ ఈ సమయంలో వారికి ఎటువంటి మ్యాచ్ లేకపోవడంతో వారి వారి కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు టీమిండియా ప్లేయర్లు. అయితే ఇంకా వారి ఇష్టాఇష్టాలను తమ గురించి ఏదైనా కొత్త విషయాలను తెలపడానికి అప్పుడప్పుడు కొందరు ఆటగాళ్లు ఆన్లైన్ లోకి వచ్చి లైవ్ వీడియో చేస్తున్నారు. అందులో వారి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారిని ఉత్సాహ పరుస్తున్నారు.

 


ఇకపోతే దేశవ్యాప్త లాక్ డౌన్ ముగిసిన తరువాత భారత క్రికెటర్లు అందరూ నైపుణ్య శిక్షణ లో పాల్గొనే అవకాశం ఉందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (bcci) యొక్క సభ్యుడు అయిన అరుణ్ ధుమాల్ తెలిపారు. ఇప్పటివరకు కరోనా నేపథ్యంలో మూడు సార్లు దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా నరేంద్ర మోడీ చేసిన ప్రకటన ప్రకారం లాక్ డౌన్ 4.0 ఉంటుందని ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. 

 

IHG
అయితే ఇక మే 18 నుంచి కొన్ని సడలింపులతో ఈ లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రధాని వెల్లడించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ధుమాల్ గుర్తు చేస్తూ ఇక ఆ సమయంలో క్రికెటర్లకు ప్రాక్టీస్ ప్రారంభం చేసే విధంగా భావిస్తోందని bcci తరఫున మాట్లాడారు. ఇకపోతే మే 18 తర్వాత స్కిల్ బేస్డ్ శిక్షణ మొదలు అయ్యేటట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆటగాళ్ల ఆట, ఆరోగ్యం విషయంలో ఎలాంటి అజాగ్రత్తలకు తావు ఇవ్వబోమని తెలిపారు. అయితే వైరస్ పూర్తిగా తగ్గిన తర్వాత శిక్షణ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరుగుతాయని కూడా ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: