కరోనా నేపథ్యంలో ప్రపంచం మొత్తం మీద క్రీడా రంగం పూర్తిగా కుదేలైంది అని అందరికీ తెలిసిన విషయమే. అయితే వివిధ దేశాల క్రికెట్ బోర్డులు అన్ని ఇప్పటికే వేల కోట్లు నష్టపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇక మన భారత దేశ క్రికెట్ బోర్డు అయిన బిసిసిఐ కూడా ప్రస్తుతం చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పవచ్చు. దీనికి కారణం ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ జరగకపోవడమే. మొదటగా మార్చి నెలలో మొదలు అవ్వాల్సిన ఐపీఎల్ సీజన్ కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 15 కు వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి దేశంలోలాక్ డౌన్ పెరుగుతూ వెళ్తున్న కారణంతో ఐపీఎల్ ఇప్పటి వరకు ఎప్పుడు మొదలవుతుందో తెలియని సంగతి ఏర్పడింది.


ఇకపోతే మన భారత్ లో అత్యధిక క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్ అని చెప్పవచ్చు. దీనికి కారణం అనేక దేశాల ఆటగాళ్లు ఇందులో పాల్గొని ఆడుతూ 45 రోజులు భారతదేశంలో క్రికెట్ పండుగ వాతావరణం లాగా దీన్ని అభివర్ణిస్తారు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ జరగకపోతే గనక బిసిసిఐకి నాలుగు వేల కోట్ల రూపాయలు భారీ నష్టం వాటిల్లుతుందని ఇప్పటికే బోర్డు సభ్యులు తెలియజేశారు. 

 

ఇదివరకే వివిధ దేశాల్లో ఆయా క్రికెట్ బోర్డులు క్రికెటర్ల జీవితాలలో కోతలు విధించిన సంగతి తెలిసిందే. అయితే బాగా సంపన్న బోర్డుగా పేరున్న బిసిసిఐ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కోతలు ఆటగాళ్లకు విధించలేదు. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం ముందు ముందు ఆటగాళ్ళ జీతాలపై ఈ కోత పడుతుందని bcci ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ హింట్ ఇవ్వకనే ఇచ్చేశాడు. అయితే ప్రస్తుతం bcci ఆర్థిక పరిస్థితి చూస్తున్నామని అలాగే ఐపీఎల్ మాత్రం జరగకపోతే గనుక ఆటగాళ్ల జీతాల్లో కోత తప్పనిసరి అని సూచనప్రాయంగా గంగూలి ఈ విషయాన్ని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: