కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఎప్పుడు బిజీ బిజీగా ఉంటూ విదేశాల్లో తిరుగుతూ మ్యాచ్లు ఆడే క్రికెట్  ఆటగాళ్ళందరూ ప్రస్తుతం సొంత ఇంటిలోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇంట్లో ఉంటున్న ఆటగాళ్లందరూ సరికొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా తన అభిమానులతో మరింత దగ్గరవడానికి సోషల్ మీడియా వేదికగా ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నారు ఆటగాళ్లు . ఇప్పటికే  చాలా మంది ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్న విషయం తెలిసిందే. 

 

 

 తాజాగా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఫేస్బుక్ లైవ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోహిత్ శర్మ ఇండియాకు మద్దతు లభించని  దేశం ఏదైనా ఉంది అంటే అది బంగ్లాదేశ్ మాత్రమే అంటూ స్పష్టం చేశాడు . అక్కడ టీమిండియా జట్టుకు  ఎలాంటి సపోర్టు లభించదని కేవలం ఆతిధ్య జట్టుకు మాత్రమే మద్దతు ఇస్తూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.భారత్, బంగ్లాదేశ్ దేశాల క్రికెట్ అభిమానులు అందరూ ఆట పట్ల ఎంతో అనురక్తితో ఉంటారని ఏమైనా తప్పులు చేస్తే విమర్శించే వాళ్ళు కూడా ఎక్కువే ఉంటారు అంటూ తెలిపిన రోహిత్ శర్మ బంగ్లాదేశ్లో పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని చెప్పుకొచ్చారు. 

 

 అయితే టీమిండియా ఆటగాళ్లు ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ప్రేక్షకులు టీమిండియాను కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు... బంగ్లాదేశ్ లో  మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది అంటు రోహిత్  తెలిపారు. అయితే ఒక్క ప్రేక్షకుడు కూడా టీమిండియాకు మద్దతు ఇచ్చే వాళ్ళు కాదు... ఎలాంటి మద్దతు లేకుండానే బంగ్లాదేశ్తో తాము మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: