ప్రస్తుతం క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యం గురించి చర్చ జరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు గత ఎనిమిది నెలల నుంచి దీనికి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. ధోని రిటైర్మెంట్కు సంబంధించి ఇప్పటికే ఎంతోమంది ఇండియన్ మాజీ క్రికెటర్లు ప్రస్తుత క్రికెటర్లు విదేశీ క్రికెటర్లు సైతం స్పందించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ తన రిటైర్మెంట్ కు సంబంధించి ఇప్పటివరకు ధోనీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.దీంతో ధోనీ కెరియర్ ఏమిటి అన్నది అటు ప్రేక్షకుల కు కూడా ప్రశ్నార్థకంగానే మారిపోయింది. 

 

 

 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టలేదు. ఇక ఐపీఎల్లో అయిన ఆడుతాడు అని భావించినప్పటికీ అది కాస్త వాయిదా పడింది.దీంతో ప్రస్తుతం ఎంఎస్ ధోని భవితవ్యం గురించి చర్చ మరోసారి ఊపందుకుంది. ఇక ధోనీ మళ్లీ ఆడితే బాగుంటుందని కొందరు భావిస్తుంటే... మరికొంతమంది రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 

 ధోనీ తన కెరీర్ని ముగించేలా వద్దా అనే విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని.. రిటైర్మెంట్ ప్రకటించాలా వద్దా అన్నది ధోని వ్యక్తిగత విషయం అంటూ హెడెన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆట నుంచి ఎప్పుడు బయటకు రావాలి అనే విషయం ప్రతి ఛాంపియన్ ఆటగాడికి తెలిసి ఉంటుంది. నా దృష్టిలో మహేంద్ర సింగ్ ధోనీ ఒక ఛాంపియన్. బలవంతంగా ఆట నుంచి గెంటివేయబడాలి  అని ఎవరూ అనుకోరు. ధోనీ తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. తన కెరియర్  గురించి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు అని భావిస్తున్నాను మాథ్యూ హేడెన్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: