టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ... బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క జంటకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరికి సంబంధించిన ఏదైనా చిన్న అప్డేట్ వచ్చిన  అది క్షణాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఈ జంటను అభిమానులు తెగ ఆరాధిస్తూ వుంటారు. అయితే ఎన్నో ఏళ్ల పాటు ప్రేమ సాగరంలో మునిగి తేలిన ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ తో  ఒకటి అయిన విషయం తెలిసిందే. ఈ జంట ఎక్కడ కనిపించినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారి పోతూ ఉంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో  ఇంటికే పరిమితమైన ఈ జంట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. 

 

 

 ఈ జంట మధ్య ప్రేమ ఆప్యాయత కూడా అభిమానులు ఎంతో ఆకర్షిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక అభిమానులు ఈ ఇద్దరి జంట కి  ప్రేమగా విరుష్క  ముద్దుపేరు కూడా పెట్టుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు అభిమానులను అలరించే ఈ జంట ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అప్డేట్లను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతారు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ తమ ప్రేమకు సంబంధించి  ఓ విషయాన్ని చెప్పి అందరినీ షాక్ ఇచ్చారు. 

 

 

 అదేంటంటే బాలీవుడ్ హీరోయిన్ అయిన తన భార్య అనుష్కకి ఇప్పటివరకూ తాను ఒక్కసారి కూడా ప్రపోస్  చేయలేదు అంటూ టీమ్ ఇండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.  తాజాగా అభిమానులతో ముచ్చటించిన విరాట్ కోహ్లీ... మొదటిసారి మీ భార్యకు మీరు ఎప్పుడు ప్రపోజ్ చేశారు అన్న ప్రశ్నకు ఈ సమాధానం తెలిపాడు.. అయితే తనకు ఎప్పుడూ పోస్ట్ చేయాలని కూడా అనిపించలేదు అని... కానీ అన్ని అలా జరిగి పోయాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తమ పెళ్లి సమయంలో తాను ఆటలో బిజీగా ఉన్నప్పుడు అనుష్కనే అన్ని ఏర్పాట్లు చేసుకుంది అంటూ తెలిపాడు. అనుష్క తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచీ తన జీవితం ఎంతగానో మారిపోయింది అంటూ తన భార్య పై ప్రశంసల వర్షం కురిపించాడు విరాట్ కోహ్లీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: