టీమిండియా డేర్  అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మైదానంలో ఆట విషయంలో ఎంతో ఖచ్చితత్వంతో ఉంటాడో...  ఇక ఫిట్నెస్ విషయంలో కూడా... విరాట్ కోహ్లీ అంతే ఖచ్చితత్వం గా ఉంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఆటగాళ్లు  అందరిలో విరాట్ కోహ్లీ ఫిట్నెస్ టాప్ లో ఉంటుంది అనే విషయం. అయితే తాజాగా తన ఫిట్నెస్ గురించి విరాట్  కోహ్లీ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ఇప్పుడు ఇంత ఫిట్  గా ఉన్నాను అంటే దానికి కారణం... భారత జట్టుకు ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్న శంకర్ బసు  అంటూ చెప్పుకొచ్చారు. 

 

 అయితే గతేడాది వరల్డ్ కప్ సమయంలో భారత జట్టు సెమీస్లో పోరాటం ముగిసిన తర్వాత తన పదవీకాలం ముగియడంతో తప్పుకున్న శంకర్  బసు  మళ్ళీ ట్రైనర్ గా రావడానికి మొగ్గు చూపలేదు. అయితే తన లో అతి పెద్ద మార్పు రావటానికి ఎంతో  పరిణితి చెంది గొప్ప విజయం సాధించడానికి శంకర్ బసు  కారణం అంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ.  శంకర్ బసు  సూచనలు సలహాలతో 2015 నుంచి ఫిట్నెస్  పరంగా ఎంతగానో శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించాను  అని తెలిపిన విరాట్  కోహ్లీ.. తన కెరీర్ గ్రాఫ్ కూడా అప్పటి నుంచే అంతకంతకూ పెరుగుతూ వచ్చింది అంటూ తెలిపాడు. ప్రస్తుతం తాను ఇంత ఫిట్  గా ఉన్నాను అంటే దాని క్రెడిట్ మాత్రం  తాను  తీసుకొనని..  ఆ క్రెడిట్ మొత్తం శంకర్ బస్సు కి చెందుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. 

 

 

 అయితే అటు ఐపీఎల్ లో కూడా శంకర్ బసు  విరాట్ కోహ్లీ తోనే ఉన్నాడు. ఎందుకంటే ఆర్సిబి ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్నారు శంకర్ బస్సు. శంకర్ బస్సు కారణంగానే తాను ఎంతో పరివర్తనం చెందాను  అంటూ చెప్పుకొచ్చాడు విరాట్  కోహ్లీ. నా డైట్ విషయంలో ఫిట్నెస్ విషయంలో ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ తన కెరీర్ వేరే లెవెల్ కి తీసుకెళ్లడంలో శంకర్ బసు  పాత్ర మరువలేనిది అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా భారత ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి తో  జరిగిన ఇన్స్టా  లైవ్ చాట్ లో కోహ్లీ ఈ విషయాలను వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: