భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నాన్న పేరు ప్రేమ్. ఆయన కోహ్లీ 18వ ఏట లోనే చనిపోయారు. ఆదివారం రోజు ఫుట్బాల్ ప్లేయర్ అయిన సునీల్ ఛెత్రి తో ముచ్చటించిన విరాట్ కోహ్లీ మరణించిన తన నాన్న గురించి గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇంస్టాగ్రామ్ లైవ్ చాట్ లో సునీల్ ఛెత్రి తో మాట్లాడిన విరాట్ కోహ్లీ తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. తాను మాట్లాడుతూ... నేను పుట్టిన స్వస్థలమైన ఢిల్లీలో ఎన్నో జరగకూడనివి జరుగుతూ ఉంటాయి. ఒకానొక సందర్భంలో నన్ను సెలెక్ట్ చేయాల్సిన ఒక అతను సెలక్షన్ క్రైటీరియా రూల్స్ ఫాలో అవ్వలేదు. ఆ వ్యక్తి మా నాన్న తో మాట్లాడుతూ... "మీ కుమారుడికి సెలెక్ట్ అయ్యేంత ప్రతిభ ఉంది కానీ అతడి సెలక్షన్ కన్ఫాం చేయాలంటే కాస్త ఎక్స్ట్రా(లంచం) ఇవ్వాల్సి ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.


కోహ్లీ ఇంకా మాట్లాడుతూ... నా తండ్రి నిజాయితీగల వ్యక్తి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అతని యుక్తవయసులో రేయింబవళ్లు కష్టపడి లాయర్ ఉద్యోగాన్ని సంపాదించాడు కానీ ఆ వ్యక్తి అడిగిన ఆ కాస్త ఎక్స్ట్రా ఏంటో మా నాన్నకి అర్థం కాలేదు. మీరు నా కుమారుడిని సెలెక్ట్ చేయాలనుకుంటే... అతని ప్రతిభ చూడండి. వాడి ప్రతిభ చూసి సెలెక్ట్ చేస్తే చేయండి లేకపోతే లేదు. కానీ నేను మాత్రం ఆ కాస్త ఎక్స్ట్రా(లంచం) ఇవ్వడానికి సిద్ధంగా లేను అని తన నాన్న చాలా ప్రశాంతంగా చెప్పాడని తెలిపాడు.


'మా నాన్న సమాధానం విన్న తర్వాత అతడు నన్ను సెలెక్ట్ చేయలేదు. దాంతో నేను బాగా ఏడ్చాను. కానీ ఆ సంఘటన నాకు ఎన్నో మంచి విషయాలను నేర్పింది. నేను అందరి కంటే ఎక్స్ట్రార్డినరీగా ఉంటేనే సక్సెస్ అవుతానని అప్పుడే నాకు అర్థం అయింది. నాకు కావాల్సింది దక్కాలంటే అది కేవలం నా హార్డ్ వర్క్, గట్టి ప్రయత్నం చేస్తేనే దక్కుతుందని నాకు తెలిసి వచ్చింది. మా నాన్న నాకు ప్రత్యేకంగా ఒక్క మాట కూడా చెప్పకుండా తన ప్రవర్తన ద్వారానే నాకు ఎంతో నేర్పారు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.


తన తండ్రి మరణించిన అనంతరం... తాను బాగా మోటివేట్ అయ్యి తన జీవితంలో తనకిష్టమైన క్రికెట్ క్రీడ ద్వారా మంచి పేరును సంపాదించాలని అనుకున్నాడట. 'నేను మా నాన్న చనిపోయారని కృంగిపోలేదు. నా కెరీర్ లో ఎలా ముందుకు వెళ్లాలనే ఆలోచించాను. మా నాన్న చనిపోయిన రెండవ రోజే రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొని బ్యాటింగ్ చేశాను. అతని మరణమే నా జీవితంలో నేను గొప్పవాడివి కావాలని ముందుకు నడిపింది. చనిపోయిన మా నాన్నకి నా ద్వారా అయినా మంచి పేరు తేవాలని అనుకున్నా. బాగా కష్టపడి ఫలానా ప్రేమ్ కొడుకు ఇంత గొప్పవాడు అయ్యాడా అని చెప్పుకునేలా చేశాను. ఈ సమయంలో మా నాన్న బతికి ఉన్నట్లైతే చాలా బాగుండు అని నేను ఎన్నో సార్లు అనుకుంటాను. అతని గురించి ఆలోచిస్తూ అప్పుడప్పుడూ నేను చాలా భావోద్వేగానికి గురవుతాను' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: