ప్రతి ఏడాది ఈ సారి టైంకి ఐపీఎల్ మారుమోగుతూ ఉండేది. ఈ టోర్నీకి ఇండియాలో కొన్ని కోట్లలో బెట్టింగ్లు జరిగేవి. ప్రేక్షకులతో స్టేడియాలు కిటకిటలాడేవి. అయితే కరోనా వైరస్ రాకతో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రద్దయింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన వెంటనే టోర్నీని నిర్వహించాలని నిర్వాహకులు అనుకున్నారు. కానీ దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగిస్తూ వచ్చింది. ఇటువంటి సమయంలో ఇటీవల మే 17 నుండి మళ్ళీ మే 31 వరకు నాలుగో దశ లాక్ డౌన్ పొడిగించడం మనకందరికీ తెలిసినదే. ఇటువంటి సమయంలో కొన్ని ఆంక్షలను సడలిస్తూ స్టేడియంలో ను ఓపెన్ చేసి క్రీడలను నిర్వహించుకోవచ్చు అని కేంద్రం అనుమతి ఇచ్చింది.

 

దీంతో ఇప్పుడు ఐపీఎల్ పై అందరి దృష్టి పడింది.  ఐపీఎల్ జరిగే అవకాశం ఉందని  అందరూ భావిస్తున్నారు. మరి ఈ సమయంలో నిర్వాహకులు నిర్వహిస్తారా లేదా అన్నది చాలా సస్పెన్స్ గా మారింది. క‌రోనా లాక్‌డౌన్‌కు ముందు టోర్నీని ప్రేక్ష‌కులు లేకుండానే నిర్వ‌హించాల‌ని చూశారు. కానీ అది వీలు కాలేదు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ 4.0 లో ప్రేక్ష‌కులు లేకుండా క్రీడ‌లు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని అనుమ‌తులు ఇచ్చారు. దీంతో బీసీసీఐ ఇప్పుడీ విష‌యంపై పున‌రాలోచ‌న చేస్తున్న‌ట్లు తెలిసింది.

 

మరి అంతా ఓకే అయితే ఐపీఎల్ టీమ్ లో ఉన్న విదేశీ ఆటగాళ్లను భారత్ కి ఎలా రప్పించాలి అన్నది కన్ఫ్యూజన్ గా ఉంది. విమాన సర్వీసులు రాకపోకలకు ఇంకా కేంద్రం నుండి అనుమతి రాకపోవడంతో ఈ విషయంలో బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఎలాగైనా ఐపీఎల్ ఈ సీజన్లో నిర్వహించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ నిర్వహిస్తే కచ్చితంగా క్రికెట్ ప్రేమికులకు ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: