దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈసారి ఏకంగా మే 31 వ తారీకు వరకు ఈ పొడిగింపుని కొనసాగించింది కేంద్రం. ఇకపోతే ఇందుకుగాను అనేక సడలింపులు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనితో కొన్ని రంగాల వారికి లాభం చేకూరుతుంది. అయితే ఈ నిబంధనలలో క్రీడా రంగానికి సంబంధించి కూడా కొన్ని మినహాయింపులు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. క్రీడా రంగానికి సంబంధించి ప్రేక్షకులు ఎవరు లేకుండా క్రీడా వేదికలు, స్టేడియంలు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే మార్చి నెలలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ఇప్పటివరకు మొదలవలేదు. అయితే ఈ సంవత్సరం ఐపీఎల్ జరిగే విధంగా కనబడట్లేదు.


ఇందుకు కారణం ఐపీఎల్ ఆడాలంటే ప్లేయర్లు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అది కాకుండా మైదానంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ ని కొనసాగించాలంటే కాస్త కష్టమైన పనే. అయితే ఇప్పుడు ఈ విషయంపై ప్రస్తుతం ఐపీఎల్ సాధ్యంకాదని బిసిసిఐ చెబుతోంది. ప్రస్తుతానికి ఐపీఎల్ ని నిర్వహించాలని బిసిసిఐకి ఆలోచన లేదని కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు.


ఇందుకు ప్రధాన కారణం ప్రయాణ ఆంక్షలు అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ కు ప్లేయర్లు ప్రయాణించి వేరేచోట మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దీనితో ప్రయాణ ఆంక్షలు ఇంకా కొనసాగుతుండటంతో ఐపీఎల్ నిర్వహణ ఇప్పుడే సాధ్యం కాదని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలను, అలాగే ఆయా రాష్ట్రాల ప్రభుత్వ మార్గదర్శకాలను అధ్యయనం చేస్తున్నామని ఆ తర్వాతే వాటి ప్రకారం మేము ఒక ప్రణాళిక రూపొందించుకుంటే అని అరుణ్ ధుమాల్ తెలిపారు. ఏది ఏమైనా భారత్లో క్రికెట్ పండుగలాంటి ఐపీఎల్ సీజన్ జరగకపోవడంతో క్రికెట్ అభిమానులు అందరూ చాలా నిరాశ చెందారు అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో టీ 20 వరల్డ్ కప్ కోసం పనికొస్తుంది అని భావిస్తే అది కాస్త ఆవిరి అయ్యే విధంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: