ప్రస్తుతం క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విదేశీ అభిమానులు సైతం విరాట్ కోహ్లీ ఆట చూస్తే ఫిదా అయిపోవాల్సిందే. తనదైన అద్భుతమైన ప్రదర్శన తో ఏకంగా ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్మెన్గా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఓవైపు జట్టును ముందుండి నడిపిస్తునే  మరోవైపు జట్టులో కీలక ఆటగాడిగా తన సత్తా చాటుకున్నాడు. మైదానంలో ఎప్పుడు తనదైన హావా భావాలతో అగ్రెసివ్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఇక విరాట్ కోహ్లీ అభిమానుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 


 అయితే ప్రస్తుతం లాక్ డౌన్ తో క్రికెట్ మ్యాచ్ లూ  అన్ని నిలిచిపోవడంతో ఎప్పుడూ బిజీగా ఉండి ఆటగాళ్లందరూ ప్రస్తుతం ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పలువురితో ముచ్చటిస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొస్తున్నారు ఆటగాళ్లు . ఈ క్రమంలోనే టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ... తాజాగా భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛత్రి తో  లైవ్ చాట్ లో పాల్గొని  పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు కోహ్లీ

 

 స్టేట్ క్రికెట్లో తనను ఎంపిక చేయడం కోసం అప్పుడు అధికారులు లంచం డిమాండ్ చేశారు అంటూ విరాట్  కోహ్లీ  చెప్పుకొచ్చాడు. అయితే తన తండ్రి ప్రేమ్ కోహ్లీ మాత్రం లంచం ఇచ్చేందుకు ఒప్పుకోలేదని.. తన కెరియర్ లో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి తనకు ఎంతో స్ఫూర్తి గా ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు విరాట్  కోహ్లీ . తన తండ్రి దీపాల కింద చదివి పైకి వచ్చారని... అప్పట్లో ఎన్నో కష్టాలు పడ్డారని..అప్పటి  పరిస్థితులు కూడా అలాగే ఉండేవి అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు. అలాగే ఆయన ఓ గొప్ప లాయర్గా ఎదిగారని అంతకుముందు మర్చంట్ నేవీ లో పని చేశారు అంటూ గుర్తు చేశారు విరాట్ కోహ్లీ. అయితే ఎంతో కష్టపడి పైకి వచ్చిన మా నాన్నకు లంచం లాంటి పదాలు నచ్చవు అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు. జీవితంలో పైకి రావాలంటే సులభతరం మార్గాల్లో కాకుండా కష్టపడి పైకి రావాలి అన్నదే మా నాన్న  నమ్మిన సూత్రం అని విరాట్ కోహ్లీ తన ప్రేమ గురించి పలు విషయాలను వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: